న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో డకౌట్: సచిన్ సరసన పుజారా

India vs Australia, 3rd Test: Pujara joins elite club of Bradman, Tendulkar, Viv Richards for a forgettable record

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఛటేశ్వర్ పుజారా అరుదైన ఘనత సాధించాడు. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 443/7 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్‌మెన్లలో పుజారా (106) సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పుజారా

తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పుజారా

అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌‌లో 151 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌‌లో తాను ఆడిన తొలి బంతికే డకౌటయ్యాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పుజారా సెంచరీ బాది డకౌట్ కావడం కావడం ఇది రెండోసారి. దీంతో పుజారా అరుదైన జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

2015లో శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో

2015లో శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో

2015లో శ్రీలంకపై తొలి ఇన్నింగ్స్‌లో 145 పరుగులు చేసిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌటయ్యాడు. తాజాగా మెల్‌బోర్న్ టెస్టులోనూ ఇలాగే ఔట్ కావడంతో పుజారా మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సరసన చేరాడు. సచిన్ టెండూల్కర్ కూడా తన సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో ఈ విధంగా రెండుసార్లు ఔటయ్యాడు.

 సచిన్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్

సచిన్ కూడా రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్

1999లో పాకిస్థాన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన సచిన్ రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. 2002లో వెస్టిండీస్‌పై కూడా అచ్చం ఇలాగే సచిన్ ఔటయ్యాడు. సర్ డాన్ బ్రాడ్‌మన్, వివియన్ రిచర్డ్స్, గార్‌ఫీల్డ్ సోబెర్స్, జాక్వెస్ కలిస్, డార్లీ కుల్లినన్‌లు ఈ జాబితాలో ఉన్నారు.

మూడుసార్లు ఒకే టెస్టులో సెంచరీతోపాటు డకౌట్‌

మూడుసార్లు ఒకే టెస్టులో సెంచరీతోపాటు డకౌట్‌

ఇక, విండీస్ క్రికెటర్ శివనారాయణన్ చంద్రపాల్ అత్యధికంగా మూడుసార్లు ఒకే టెస్టులో సెంచరీతోపాటు డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పుజారా ఆకట్టుకనే ప్రదర్శన చేస్తున్నాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 54.67 యావరేజితో 328 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.

Story first published: Saturday, December 29, 2018, 10:52 [IST]
Other articles published on Dec 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X