న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాక్సింగ్ డే టెస్టు: ఆసీస్ విజయ లక్ష్యం 399, విజయం దిశగా భారత్

India Vs Australia, 3rd Test: Day 4 Live Updates: Hosts 44/2 at lunch in run chase of 399

హైదరాబాద్: మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా జట్టుకి 399 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. ఆటలో భాగంగా నాలుగో రోజైన శనివారం 54/5తో రెండో ఇన్నింగ్స్‌ని కొనసాగించిన టీమిండియా 106/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

399 పరుగుల లక్ష్యంతో

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 292 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని మొత్తం 399 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు ముందు ఉంచింది. శనివారం తొలి సెషన్‌లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (42: 102 బంతుల్లో 4 పోర్లు, 2సిక్సులు), రిషబ్ పంత్ (33: 43 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్) ఫరవాలేదనిపించారు.

ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ

టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తలిగింది. ఈ టెస్టు సిరిస్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ఓపెనర్ ఆరోన్ ఫించ్(3) మరోసారి ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

జడేజా బౌలింగ్‌లో ఔట్

అనంతరం మరో ఓపెనర్ హారిస్ (13) స్పిన్నర్ జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో జట్టు స్కోరు 33 పరుగులకే ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉస్మాన్ ఖవాజా (33) కూడా మహ్మద్ షమీ బౌలింగ్‌లో జట్టు స్కోరు 63 వద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు.

వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసిన ఆసీస్

వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసిన ఆసీస్

ప్రస్తుతం 28 ఓవర్లకు గాను ఆతిథ్య జట్టు 3 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. క్రీజులో షాన్ మార్ష్ (25), ట్రావిస్ హెడ్ (15) పరుగులతో ఉన్నారు. ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 306 పరుగులు చేయాల్సి ఉంది.

1
43625
Story first published: Saturday, December 29, 2018, 8:50 [IST]
Other articles published on Dec 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X