న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెల్ బోర్న్‌లో 2nd T20I: ప్రివ్యూ, మ్యాచ్ ఎక్కడ చూడాలి, టైమింగ్, జట్ల వివరాలు

India vs Australia, 2nd T20I: Preview, where to watch, timing, squads and more

హైదరాబాద్: ఆసీస్ గడ్డపై టీమిండియా మరో టీ20 మ్యాచ్‌కు సిద్ధమైంది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20 జరగనుంది. మూడు టీ20ల సిరిస్‌లో ఈ మ్యాచ్ కోహ్లీసేనకు ఇది చావోరేవో కానుంది. టోర్నీలో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఆమెను తెచ్చినందుకు రాబిన్ ఊతప్పకు థ్యాంక్స్ చెప్పిన ధోని భార్యఆమెను తెచ్చినందుకు రాబిన్ ఊతప్పకు థ్యాంక్స్ చెప్పిన ధోని భార్య

ఈ సిరిస్‌లో ఇప్పటికే 1-0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా రెండో టీ20లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా... టీమిండియా మాత్రం ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. దీంతో తప్పక గెలవాల్సిన రెండో టీ20లో టీమిండియా స్వల్ప మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది.

పాండ్యా స్ధానంలో చాహాల్?

పాండ్యా స్ధానంలో చాహాల్?

తొలి టీ20లో ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా నాలుగు ఓవర్లు వేసి 55 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు వికెట్లు కూడా పడగొట్టలేదు. పాండ్యా బౌలింగ్‌లో ఆసీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అయితే ఏకంగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. దీంతో ఈ మ్యాచ్‌లో పాండ్యా స్థానంలో చాహాల్‌కు చోటు దక్కొచ్చు. మరోవైపు తొలి టీ20లో మూడో స్థానంలో వచ్చిన కేఎల్ పూర్తిగా విఫలమయ్యాడు.

కేఎల్ రాహుల్ స్థానంలో మనీష్ పాండే?

కేఎల్ రాహుల్ స్థానంలో మనీష్ పాండే?

ఇంగ్లాండ్‌ పర్యటనలో జరిగిన తొలి టీ20లో సెంచరీ సాధించిన తర్వాత తాను ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ దాటకపోవడం విశేషం. కాగా, బ్రిస్బేన్ టీ20లో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీంతో రెండో టీ20లో అతడి స్థానంలో మనీశ్‌ పాండేకి చోటు కల్పించే అవకాశం ఉంది. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్‌లు చక్కగా రాణిస్తున్నారు.

తొలి టీ20లో చేసిన తప్పిదాలు పునరావృతం కానిస్తారా?

తొలి టీ20లో చేసిన తప్పిదాలు పునరావృతం కానిస్తారా?

ఇక, తొలి టీ20లో చేసిన చిన్నపాటి తప్పిదాలైన రనౌట్లు, క్యాచ్‌లు మిస్ చేయడం లాంటివి ఈ మ్యాచ్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇక, ఆస్ట్రేలియా విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత విజయాన్ని అందుకుంది. ఈ విజయం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఆసీస్ జట్టు తరుపున తొలి టీ20లో ఆడిన ఏకైక స్పిన్నర్ ఆడమ్ జంపా అద్భుతాలు చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్‌ని పెవిలియన్‌కు చేర్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

పిచ్, వాతావరణం:

పిచ్, వాతావరణం:

తొలి టీ20 జరిగిన బ్రిస్బేన్‌ తరహాలోనే మెల్‌బోర్న్‌లోనూ వర్షం పడే అవకాశాలున్నాయి. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ప్రపంచంలోనే అతిపెద్ద మైదానం. పిచ్ పూర్తిగా పచ్చికతో కూడుకుని ఉంది.

టెలికాస్ట్:

సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్

మధ్యాహ్నాం 1.20 గంటలకు

లైవ్ స్ట్రీమింగ్:

సోనీ లైవ్

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత్ తుది జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్య, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్

ఆస్ట్రేలియా తుది జట్టు: అరోన్ ఫించ్‌ (కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌,డీఆర్క్ షార్ట్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, బెరెన్‌డార్ఫ్‌, అలెక్స్‌ కేరీ, స్టాన్‌లేక్‌, ఆండ్రూ టై, ఆడమ్ జంపా

Story first published: Thursday, November 22, 2018, 17:28 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X