న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ, సచిన్‌, లారా రికార్డులు బద్దలు కొట్టేందుకు 46 పరుగుల దూరంలో రోహిత్

India vs Australia 2nd ODI: Rohit Sharma 46 runs away from going past Sourav Ganguly, Sachin Tendulkar and Brian Lara in Rajkot

హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మరో 46 పరుగులు చేస్తే అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 9000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు.

ఫలితంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంటాడు. అదే క్రమంలో మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, సౌరవ్‌ గంగూలీ, బ్రియన్‌ లారాల రికార్డుని కూడా బద్దలు కొట్టనున్నాడు. ప్రస్తుతం రోహిత్‌ శర్మ వన్డేల్లో 215 ఇన్నింగ్స్‌ల్లో 8,954 పరుగులు చేశాడు.

IND vs AUS 2nd ODI: భారత్‌లో మొదటి పైకప్పు స్టేడియంగా రాజ్‌కోట్ స్టేడియం!IND vs AUS 2nd ODI: భారత్‌లో మొదటి పైకప్పు స్టేడియంగా రాజ్‌కోట్ స్టేడియం!

వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని

వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని

అయితే, వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకునేందుకు సౌరవ్ గంగూలీ 228 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా... సచిన్ టెండూల్కర్ 235, లారా 239 ఇన్నింగ్స్‌లు తీసుకున్నారు. ఆస్ట్రేలియాతో రాజ్‌కోట్‌ వేదికగా జరిగే మూడో వన్డేలో రోహిత్ శర్మ మరో 46 పరుగులు చేస్తే వీరికంటే అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధిస్తాడు.

వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో

వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో

అంతేకాదు వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (194), ఏబీ డివిలియర్స్‌ (205) తర్వాతి స్థానంలో నిలుస్తాడు. దీంతో పాటు రాజ్‌కోట్‌లో రోహిత్ సెంచరీ సాధిస్తే వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో ఆటగాడిగా గుర్తింపు పొందుతాడు.

28 సెంచరీలతో

28 సెంచరీలతో

ప్రస్తుతం 28 సెంచరీలతో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్‌ జయసూర్యతో రోహిత్ శర్మ సమంగా ఉన్నాడు. ముంబై వేదికగా జరిగిన తొలి వన్డేలో నిరాశ పరిచిన రోహిత్ శర్మ రెండో వన్డేలో ఏడు సిక్సర్లు బాదితే మూడు ఫార్మాట్లలోనూ ఆస్ట్రేలియాపై 100 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు.

ఆస్ట్రేలియాపై 991 పరుగులు చేసిన కోహ్లీ-రోహిత్ జోడీ

ఆస్ట్రేలియాపై 991 పరుగులు చేసిన కోహ్లీ-రోహిత్ జోడీ

దీంతో పాటు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు కలిసి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాపై 991 పరుగులు చేశారు. వీరిద్దరూ రెండో వన్డేలో మరో 9 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై 1000 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఐదో జోడీగా నిలుస్తారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

Story first published: Friday, January 17, 2020, 13:00 [IST]
Other articles published on Jan 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X