న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దంచికొట్టిన ధావన్.. కోహ్లీ, రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా టార్గెట్ 341

India vs Australia 2nd ODI: KL RahulS quick fire 80 takes host to 340/6

రాజ్‌కోట్‌: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్‌మన్‌ చెలరేగారు. ఓపెనర్ శిఖర్ ధావన్ (96; 90 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌) దంచికొట్టగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (78; 76 బంతుల్లో 6 ఫోర్లు), కేఎల్ రాహుల్ (80; 52 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు) క్లాస్ ఇన్నింగ్స్ ఆడడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఫలితంగా ఆస్ట్రేలియా ముందు 341 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ ఆడమ్‌ జంపా మూడు వికెట్లు తీసాడు.

3 వేల పరుగులు పూర్తిచేసిన ధావన్‌-కోహ్లీ.. 10వ జోడిగా రికార్డు!!3 వేల పరుగులు పూర్తిచేసిన ధావన్‌-కోహ్లీ.. 10వ జోడిగా రికార్డు!!

అదిరే ఆరంభం:

అదిరే ఆరంభం:

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రోహిత్‌ ఔటయ్యాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించింది. ఆపై కోహ్లీ ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగాడు.

కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్:

కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్:

ధావన్-కోహ్లీ సమయోచితంగా ఆడి స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ధావన్ గేర్ మర్చి ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సెంచరీకి సరిగ్గా నాలుగు పరుగుల ముందు అవుటయ్యాడు. ఆపై వచ్చిన శ్రేయాస్ అయ్యర్ (7) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. కోహ్లీకి రాహుల్ జతకలవడంతో మళ్లీ ఇన్నింగ్స్ ఊపందుకుంది. ఈ జోడి బౌండరీలు బాదుతూ స్కోర్ వేగాన్ని పెంచారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసాడు. అయితే స్కోర్ వేగం పెంచే క్రమంలో 78 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.

చితక్కొట్టిన రాహుల్:

చితక్కొట్టిన రాహుల్:

కోహ్లీ పెవిలియన్ చేరినా.. రవీంద్ర జడేజా అండతో రాహుల్ పరుగుల వరద పారించాడు. ఐదో నంబరులో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ నంబరుతో తనకు పనిలేని నిరూపించాడు. తొలుత నిదానంగా ఆడిన రాహుల్.. చివరల్లో బ్యాట్‌ను ఝళిపించాడు. యథేచ్ఛగా బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు అతడికి జడేజా కూడా చక్కని సహకారం అందించాడు.

10 ఓవర్లు.. 78 పరుగులు:

10 ఓవర్లు.. 78 పరుగులు:

రెండు బంతుల్లో ఇన్నింగ్స్ ముగుస్తుందనగా లేని పరుగు కోసం ప్రయత్నించి రాహుల్ రనౌట్ అయ్యాడు. చివరి రెండు బంతులకు మొహమ్మద్ షమీ (1), జడేజా (20) చెరో పరుగు చేశారు. రాహుల్ ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత్ భారీ స్కోర్ చేసింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ తన 10 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 78 పరుగులు ఇచ్చాడు. సిరీస్‌లో నిలబడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ సత్తా చాటారు. ఇక బౌలర్లు విజృంభిస్తే సిరీస్ ఫలితం మూడో వన్డేకు మారనుంది.

Story first published: Friday, January 17, 2020, 17:42 [IST]
Other articles published on Jan 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X