న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టెస్టు: ఎట్టకేలకు పుజారా-అశ్విన్ జోడీని విడదీసిన కమ్మిన్స్

India vs Australia, 1st Test Day 1: Pat Cummins Breaks Cheteshwar Pujara-Ravichandran Ashwin Stand, India 7 Down

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 189 పరుగుల వద్ద అశ్విన్‌(25) పాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో హాండ్స్‌కొంబ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది.

<strong>పేక మేడలా కుప్పకూలిన భారత టాపార్డర్: 3 పరుగులకే కోహ్లీ ఔట్ (వీడియో)</strong>పేక మేడలా కుప్పకూలిన భారత టాపార్డర్: 3 పరుగులకే కోహ్లీ ఔట్ (వీడియో)

వరుసగా వికెట్లు కోల్పోతున్న క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్.. పుజారాతో కలిసి భారత్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. మొదట్లో ఆచితూచి ఆడిన అశ్విన్ ఆ తర్వాత దూకుడుగా ఆడుతూ పుజారాతో కలిసి స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కమ్మిన్స్ వేసిన ఇన్నింగ్స్ 74వ ఓవర్‌ చివరి బంతికి డిఫెన్స్ ఆడబోయి స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్‌కోంబ్ చేతికి చిక్కాడు.

1
43623
పుజారా ఒంటరి పోరాటం

పుజారా ఒంటరి పోరాటం

మరో ఎండ్‌లో పుజారా నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అశ్విన్‌ ఔట్‌ అనంతరం ఇషాంత్‌ శర్మ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్ 75 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. క్రీజులో పుజారా 73, ఇషాంత్‌ 0 పరుగులతో ఉన్నారు.

నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్లు

నిరాశపరిచిన టీమిండియా ఓపెనర్లు

అంతకముందు ఓపెనర్లు కేఎల్ రాహుల్(2), మురళీ విజయ్(11) మ‌రోసారి నిరాశ ప‌రిచారు. అనంతరం క్రీజులోకి దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 11 ఓవర్‌ మూడో బంతికి కోహ్లి పెవిలియన్‌కు చేరాడు. పాట్‌ కమిన్స్‌ వేసిన వైడ్‌ బాల్‌ను ఆఫ్‌సైడ్ బాదాడు.

ఒంటిచేత్తో కోహ్లీ క్యాచ్ పట్టిన ఉస్మాన్ ఖవాజా

ఒంటిచేత్తో కోహ్లీ క్యాచ్ పట్టిన ఉస్మాన్ ఖవాజా

ఈ క్రమంలో బౌండరీ వైపు దూసుకుపోతున్న బంతిని ఊహించనివిధంగా ఎడమవైపు డైవ్‌ చేసి ఉస్మాన్‌ ఖవాజా ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. ఈ క్యాచ్‌కి విరాట్ కోహ్లీ సైతం అవాక్యయ్యాడు. దీంతో నిరాశగా విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. మైదానంలోని సహచరులంతా ఖవాజాను అభినందనలతో ముంచెత్తారు.

 75 ఓవర్లకు టీమిండియా 190/7

75 ఓవర్లకు టీమిండియా 190/7

ఆ తర్వాత రహానే(13), రోహిత్ శర్మ(37), రిషబ్ పంత్(25) తొంద‌ర‌గానే పెవిలియ‌న్ చేరుకున్నారు. ఆసీస్ బౌలర్స్‌లో హాజిల్‌వుడ్‌కి రెండు, లియాన్‌కి రెండు, క‌మిన్స్ రెండు వికెట్లు తీయగా... మిచెల్ స్టార్క్ ఒక వికెట్ తీశాడు.

Story first published: Thursday, December 6, 2018, 12:41 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X