న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విశాఖలో తొలి టీ20: కేఎల్ రాహుల్ ఫిఫ్టీ, ఆసీస్ విజయ లక్ష్యం 127

KL Rahul

హైదరాబాద్: విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా స్వల్పస్కోర్‌కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. బెహ్రెన్‌డోర్ఫ్ వేసిన మూడో ఓవర్ మూడో బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ(5) అడమ్ జంపాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

అనంతరం కేఎల్‌ రాహుల్‌తో కలిసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ స‍్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కి 55 పరుగులు జోడించారు. ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో ఆడం జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్ కోహ్లీ(24) కౌంటర్‌ నైల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ఆ తర్వాత కాసేపటికి రిషభ్‌ పంత్‌(3) అనవసరపు పరుగు కోసం యత్నించి రనౌటయ్యాడు. డీ ఆర్షీ షాట్ వేసి పదో ఓవర్ చివరి బంతికి రిషబ్ అత్యంత చెత్తగా రనౌటై వెనుదిరిగాడు. దాంతో భారత్‌ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత కేఎల్ రాహుల్‌(50) హాఫ్‌ సెంచరీ సాధించి ఔటయ్యాడు.

1
45583

అనంతరం బ్యాటింగ్‌కి వచ్చిన దినేశ్ కార్తీక్(1), కృనాల్ పాండ్యా(1) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్‌‌కు చేరారు. చివర్లో ధోనీ.. పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్రీజులో ధోని(29 నాటౌట్‌) కడవరకూ ఉండటంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.

భారత బ్యాట్స్‌మెన్‌లలో ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ మూడు వికెట్లు సాధించగా, ఆడమ్‌ జంపా, ప్యాట్‌ కమిన్స్‌ బెహ్రన్‌డార్ఫ్‌లు తలో వికెట్‌ తీశారు.

Story first published: Sunday, February 24, 2019, 21:03 [IST]
Other articles published on Feb 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X