ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ బోణి: చెన్నై వన్డేలో ఆసీస్‌పై ఘన విజయం

Posted By:

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ బోణి చేసింది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఆసీస్‌పై భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 21వ ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించి ఆసీస్ విజయ లక్ష్యాన్ని 164 పరుగులకు నిర్ధారించారు. భారత బౌలర్లలో చాహల్ 3, కుల్దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశారు.


ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సాగిందిలా:

తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 19.1వ ఓవర్‌లో కౌల్టర్ నైల్ (2) పరుగుల చేసి అవుటయ్యాడు. ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 9 బంతులో 36 పరుగులు చేయాల్సి ఉంది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తడబడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 281 పరుగుల భారీ స్కోరు చేయగా వర్షం కారణంగా మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించి ఆసీస్ విజయ లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ధారించారు.

8వ వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 109 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో కమ్మిన్స్ (9) అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది.

ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 92 పరుగుల వద్ద చాహల్ బౌలింగ్‌లో వేడ్ (9) అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. ఆసీస్ విజయానికి 30 బంతుల్లో 67 పరుగులు చేయాల్సి ఉంది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తడబడుతోంది.

వరుసగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
చెన్నై వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 76 పరుగుల వద్ద 12.3 ఓవర్ లో స్టోయినీస్ (3) అవుటయ్యాడు. అంతకుముందు 11వ ఓవర్ చివరి బంతిలో మ్యాక్స్ వెల్ (39) అవుటయ్యాడు. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తడబడుతోంది. ఆసీస్ విజయానికి 42 బంతుల్లో 80 పరుగులు చేయాల్సి ఉంది.

Maxwell

29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 29 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో పాండ్యా రెండు వికెట్లు తీసుకోగా, బుమ్రా ఒక వికెట్ తీశాడు. నాలుగో ఓవర్ ఐదో బంతికి 15 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఓపెనర్ హిల్టన్ కార్ట్‌రైట్ (1) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఐదో ఓవర్ చివరి బంతికి పాండ్యా బౌలింగ్‌లో కెప్టెన్ స్టీవెన్ స్మిత్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పాండ్యా బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్ (5) పరుగుల వద్ద వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ మూడు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.

Smith

21 ఓవర్లకు మ్యాచ్ కుదింపు: ఆసీస్ లక్ష్యం 164
వర్షం కారణంగా ఆలస్యమైన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. భారత ఇన్సింగ్స్ ముగిసిన తర్వాత వర్షం పడడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. చాలా సేపటి తర్వాత వాతావరణం తెరిపినివ్వడంతో మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించి ఆసీస్ విజయ లక్ష్యాన్ని 238 పరుగులుగా నిర్దేశించారు.

అయితే ఆ తర్వాత మరోమారు వర్షం పడడంతో మ్యాచ్‌ను ఆసీస్‌ ఇన్నింగ్స్‌ను అంపైర్లు 21 ఓవర్లకు కుదించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 164 పరుగుల లక్ష్యం నిర్దేశించారు.

37 ఓవర్లకు మ్యాచ్ కుదింపు: ఆసీస్ విజయ లక్ష్యం 238
చెన్నై వన్డేకి రెండోసారి కూడా వరుణడు అంతరాయం కలిగించడంతో 37 ఓవర్లకు కుదించారు. దీంతో ఆస్ట్రేలియా విజయ లక్ష్యాన్ని 238 పరుగులుగా నిర్దేశించారు. 1-8 ఓవర్ల మధ్య తొలి పవర్ ప్లే, 9-30 ఓవర్ల మధ్య రెండో పవర్ ప్లే, 31-37 ఓవర్ల మధ్య మూడో పవర్‌ప్లేగా నిర్ణయించారు. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికట్లు కోల్పోయి 281 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

వర్షం అడ్డంకి: 43 ఓవర్లకు మ్యాచ్ కుదింపు

చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌ను 43 ఓవర్లుకు కుదించారు. మ్యాచ్‌కు వరుణుడు ఆటంకంగా మారడంతో డక్‌వర్త్‌లూయిస్‌ నిబంధనల ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 43 ఓవర్లలో 260 పరుగులుగా నిర్ణయించారు. భారత్ ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత వర్షం ప్రారంభం కావడంతో ఆస్ట్రేలియా ఇన్సింగ్స్ ‌ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ధోని 66వ హాఫ్ సెంచరీ, కోహ్లీ డకౌట్.. ఆసీస్ లక్ష్యం 282

అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య ఆస్ట్రేలియాకు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయిన టీమిండియాను పాండ్యా (83), ధోని (79) పరుగులతో ఆదుకున్నారు.

పాండ్యా క్రీజులో కుదురుకున్నాక ఫోర్లు, సిక్సర్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 66 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన భువనేశ్వర్ కుమార్‌తో కలిసి ధోని ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో వన్డేల్లో 66వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

ఈ క్రమంలో ధాటిగా ఆడుతూ స్కోరు పెంచే క్రమంలో 50వ ఓవర్ నాలుగో బంతికి ధోని (79) అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ 29 బంతుల్లో 5 ఫోర్లతో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో నైల్‌ 3 వికెట్లు తీయగా స్టోయిన్స్ 2, ఫాల్కనర్, జంపా చెరో వికెట్ తీసుకున్నారు.


భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:

ధోని హాఫ్ సెంచరీ
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 47వ ఓవర్‌లో కమ్మిన్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసిన ధోని తన కెరీర్‌లో 66వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మూడు ఫార్మెట్లలో కలిపి ధోనికి ఇది 100వ హాఫ్ సెంచరీ (టెస్టులు-33, వన్డేలు-66, టీ20-1) కావడం విశేషం. దీంతో 47 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ప్రస్తుతం ధోని 53, భువీ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Ms Dhoni

ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 205 పరుగుల వద్ద ఆడమ్ జంపా బౌలింగ్‌లో పాండ్యా (83) జేమ్స్ ఫల్కనర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 42 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది. పాండ్యా అవుటైన తర్వాత భువనేశ్వర్ కుమార్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో ధోని 38, భువీ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

Pandya

సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పాండ్యా
తొలి వన్డేలో హార్దిక్‌ పాండ్యా సిక్సర్ల మోత మోగించాడు. ఆసీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో పాండ్యా సిక్సర్‌తో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆడమ్‌ జంపా వేసిన 37వ ఓవర్‌లో అతడు వరుసగా మూడు సిక్సర్లు బాది వన్డేల్లో మూడో హ్యాట్రిక్‌ సిక్సర్లు నమోదు చేశాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని బౌండరీకి తరలించిన అతడు తర్వాతి మూడు బంతుల్లో మూడు భారీ సిక్సర్లు బాదేశాడు. ఈ క్రమంలో రెండో సిక్సర్‌తో పాండ్యా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్‌లో ఉన్న ధోనీ అతడికి అండగా నిలుస్తూ తన వంతు పాత్ర పోషించాడు.

వరుసగా హ్యాట్రిక్ సిక్సర్లు బాదిన పాండ్యా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 36 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. 37వ ఓవర్ వేసిన ఆడమ్ జంపాని హార్దిక్ పాండ్యా ఆడుకున్నాడు. ఈ ఓవర్‌లో పాండ్యా హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. ఈ ఓవర్‌లో భారత బ్యాట్స్‌మెన్లు 24 పరుగులు పిండుకున్నారు. ప్రస్తుతం క్రీజులో పాండ్యా 35, ధోని 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.

32 ఓవర్లకు టీమిండియా 133/5

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. 30 ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ధోని, హార్ధిక్ పాండ్యాలు నిదానంగా ఆడుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు నాలుగో ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. రహానే (5), విరాట్ కోహ్లీ(0), మనీశ్ పాండే (0), రోహిత్ శర్మ (28), కేదార్ జాదవ్ (40) పరుగుల వద్ద అవుటయ్యారు.

దీంతో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని, హార్ధిక్ పాండ్యాలు నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. ధోని 21, పాండ్యా 27 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 87 పరుగుల వద్ద కేదార్ జాదవ్ (40) స్టోయినిస్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదగా కార్ట్ రైట్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. జాదవ్ అవుటైన తర్వాత క్రీజులోకి హార్దిక్ పాండ్యా వచ్చాడు. దీంతో 22 ఓవర్లకు గాను భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. ప్రస్తుతం ధోని (8), పాండ్యా (2) పరుగులతో ఉన్నారు.

KD

నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లీసేన తడబడుతోంది. జట్టు స్కోరు 64 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 15.6 ఓవర్ వద్ద స్టోయినిస్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ (28) డీప్ స్క్వేర్ లెగ్‌లో నాథన్ కౌల్టర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. షార్ట్‌పిచ్‌లో వేసిన చివరి బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్‌ భారీ షాట్‌ ఆడాడు. గాల్లోకి లేచిన బంతిని కౌల్టర్‌నైల్‌ చక్కగా అందుకున్నాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.

India Vs Australia, 1st odi

15 ఓవర్లకు టీమిండియా 59/3
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. 11 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడ్డ జట్టుని ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (24), కేదార్‌ జాదవ్‌ (25) ఆదుకొనే ప్రయత్నం చేశారు. సింగిల్స్ తీస్తూ జట్టు స్కోరుని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

ఆదిలోనే భారత్‌కు దెబ్బ: కోహ్లీ, పాండే డకౌట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ తడబడుతోంది. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చి కెప్టెన్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. 5.1 ఓవర్ వద్ద ఆసీస్ బౌలర్ నాథన్ కౌల్టర్ బౌలింగ్‌లో గ్లెన్ మ్యాక్స్ వెల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

India Vs Australia, 1st ODI: Virat Kohli wins toss, elects to bat against Steve Smith & Co

5.1 ఓవర్‌ వద్ద కౌల్టర్‌ నైల్‌ వేసిన బంతికి కోహ్లీ షాట్‌ కొట్టేందుకు ప్రయత్నించగా.. మాక్స్‌వెల్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. దీంతో కోహ్లీ డకౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే కూడా అదే ఓవర్‌లో కౌల్టర్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్‌ 11 పరుగుల వద్దే మూడు కీలక వికెట్లు కోల్పోయింది.

ఈ మూడు వికెట్లను కౌల్టర్‌ నైల్‌ తీయడం విశేషం. దీంతో ఆరు ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ మూడు వికెట్లు కోల్పోయి 16 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో కేదార్ జాదవ్ (4), రోహిత్ శర్మ (4) పరుగులతో ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ

ఐదు వన్డేల సిరిస్‌లో తొలి వన్డే ప్రారంభమైంది. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 1987లో రిలయన్స్‌ కప్‌ అనంతరం మరోసారి ఇరు జట్లు ఇక్కడ తలపడటం ఇదే తొలిసారి.

బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ కావడంతో కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్‌ను ఎంచుకున్నాడు. ధావన్‌ తొలి మూడు వన్డేలకు అందుబాటులో లేకపోవడంతో అతడి స్ధానంలో ఓపెనర్‌గా రహానే బరిలోకి దిగనున్నాడు. కేఎల్‌ రాహుల్‌ స్ధానంలో మనీశ్‌ పాండే తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

Toss Report

ఇక శ్రీలంక పర్యటనలో రాణించిన ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వ్యక్తిగత కారణాలతో దూరమైనా జట్టు రిజర్వ్‌ బెంచ్‌ పటిష్టంగానే ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక వన్డే ర్యాంకుల్లో ఇరు జట్లు సమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా 117 పాయింట్ల‌తో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండ‌గా, టీమిండియా అదే 117 పాయింట్ల‌తో మూడవ స్థానంలో ఉంది.

ఇటీవల శ్రీలంకతో వారి దేశంలో జరిగిన సిరీస్‌లో ఘన విజయాన్ని సాధించిన కోహ్లీసేన, ఆసీస్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌ల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇరు జ‌ట్లు బ‌లంగా ఉండ‌డంతో ఈ సిరిస్ హోరాహోరీగా సాగే అవకాశాలున్నాయని క్రీడా విశ్లేష‌కుల అభిప్రాయపడుతున్నారు.

టీమిండియా: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, అజింక్యా రహానే, మనీష్ పాండే, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, భువనేశ్వర్ కుమార్

ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, కార్ట్ రైట్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టోనిస్, మాథ్యూ వేడ్, జేమ్స్ ఫాల్కనర్, పాట్ కమిన్స్, కౌల్టర్ నైల్, ఆడమ్ జంపా

Story first published: Sunday, September 17, 2017, 13:31 [IST]
Other articles published on Sep 17, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి