న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia, 1st ODI: అరుదైన రికార్డుని మిస్సైన రోహిత్ శర్మ

 India vs Australia, 1st ODI: Shikhar Dhawan firm after Rohit Sharma falls to Mitchell Starc

హైదరాబాద్: వాంఖడె వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 13 పరుగుల వద్ద రోహిత్ శర్మ(10) వికెట్‌ను కోల్పోయింది. ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్ట్‌ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతిని మిడాఫ్‌ మీదుగా ఆడటానికి రోహిత్‌ యత్నించాడు.

ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌ క్యాచ్‌ అందుకోవడంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 10 ఓవర్లకు గాను టీమిండియా వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(26), కేఎల్ రాహుల్(9) పరుగులతో ఉన్నారు. రోహిత్ ఔటైన తర్వాత రాహుల్ క్రీజులోకి వచ్చాడు.

బాలీవుడ్‌లో మరో బయోపిక్‌: జులన్ గోస్వామిగా కోహ్లీ భార్య అనుష్క!బాలీవుడ్‌లో మరో బయోపిక్‌: జులన్ గోస్వామిగా కోహ్లీ భార్య అనుష్క!

వీరిద్దరూ నిలికడగా ఆడుతూ స్కోరు బోర్డుని నడిపిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో చివరి మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీలు సాధించిన రోహిత్‌ ఈసారి మాత్రం విఫలమయ్యాడు. 2019లో సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌ 133 పరుగులు సాధించాడు.

త్వరలో 100వ బర్త్‌డే: జీవించి ఉన్న మాజీ రంజీ ఆటగాడి ఇంటికి సచిన్, వాత్వరలో 100వ బర్త్‌డే: జీవించి ఉన్న మాజీ రంజీ ఆటగాడి ఇంటికి సచిన్, వా

అంతకుముందు 2016లో వాకా వేదికగా జరిగిన తొలి వన్డేలో 171 పరుగులు చేశాడు. 2015లో మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌ శర్మ 138 పరుగులు సాధించాడు. ఇలా... ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌ శర్మ వరుసగా సెంచరీ సాధించాడు.

Story first published: Tuesday, January 14, 2020, 15:01 [IST]
Other articles published on Jan 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X