న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India Vs Australia, 1st ODI: రోహిత్ సెంచరీ వృధా, సిడ్నీలో భారత్ ఓటమి

India Vs Australia1st ODI Highlights : Australia Win By 34 Runs,Take 1-0 Lead | Oneindia Telugu
India vs Australia, 1st ODI: Rohit Ton in Vain as Australia Win by 34 Runs

హైదరాబాద్: భారత్‌తో మూడు వన్డేల సిరిస్‌లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. సిడ్నీ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. 291 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లో 9 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేసింది.

స్టీవ్‌ స్మిత్ మోచేతికి తీవ్ర గాయం: ఐపీఎల్ 2019 సీజన్‌కి దూరమే!స్టీవ్‌ స్మిత్ మోచేతికి తీవ్ర గాయం: ఐపీఎల్ 2019 సీజన్‌కి దూరమే!

దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్‌సన్(4/26) సంచలన ప్రదర్శన చేశాడు. భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్‌సన్ నాలుగు వికెట్లు తీయగా, మార్కస్ స్టోనియిస్, బెహ్రండార్ఫ్ చెరో రెండు... పీటర్ సిడ్డి‌ల్‌ ఒక వికెట్ తీశాడు.

1
43627
289 పరుగుల లక్ష్యంతో

289 పరుగుల లక్ష్యంతో

ఆస్ట్రేలియా నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తొలి ఓవర్‌లోనే వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. ధావన్‌ తాను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. బెహ్రన్‌డోర్ఫ్‌ వేసిన తొలి ఓవర్ ఆఖరు బంతికి శిఖర్‌ ధావన్‌ పరుగులేమీ చేయకుండా ఎల్బీగా వెనుదిరిగాడు.

నిరాశపరిచిన కోహ్లీ

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం‌ నాలుగో ఓవర్లోనే పెవిలియన్‌ చేరాడు. నాలుగో ఓవర్లో రిచర్డ్‌సన్‌ వేసిన మూడో బంతిని ఆడబోయిన కోహ్లీ(3) స్టాయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆపై వెంటనే అంబటి రాయుడు డకౌట్‌ కావడంతో భారత్‌ కష్టాల్లో పడింది.

ధోనితో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దిన రోహిత్

ఈ మ్యాచ్‌లో యువ పేసర్‌ రిచర్డ్‌సన్‌... కెప్టెన్ కోహ్లీ, అంబటి రాయుడు వికెట్లు తీసి ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. అదే సమయంలో క్రీజులో పాతుకుపోయిన రోహిత్‌కు సహకారం అందిస్తూ ధోని 93 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. డిసెంబర్ 2017 తర్వాత ధోని హాఫ్ సెంచరీ చేశాడు.

రోహిత్ శర్మ సెంచరీ

హాఫ్ సెంచరీ అనంతరం బెహ్రండార్ఫ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో వీరిద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. వీరిద్దరూ కలిసి 137 పరుగులు జోడించారు. ఆ తర్వాత రోహిత్ దూకుడు పెంచాడు. 62 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ 110 బంతులో సెంచరీ చేశాడు. వన్డే కెరీర్‌లో అత‌నికిది 22వ సెంచరీ.

దూకుడుగా ఆడిన రోహిత్

సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో మెరుపులు మెరిపించాడు. మార్కసో స్టోయినిస్ వేసిన 44వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాది 12 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌(12), రవీంద్ర జడేజా(8)లు నిరాశపరచడంతో భారత్‌కు ఓ‍టమి తప్పలేదు. ఆ తర్వాత స్టోయినిస్ ఓవర్లోనే రోహిత్ వెనుదిరగడంతో భారత్ ఓటమి ఖాయమైంది.

నాటౌట్‌‌గా నిలిచిన భువీ

చివర్లో భువనేశ్వర్‌ కుమార్‌(26 నాటౌట్‌) ధాటిగా బ్యాటింగ్‌ చేసినప్పటికీ భారత్ కోలుకోలేకపోయింది. అంతకముందు ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 288 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లలో ఉస్మాన్ ఖ‌వాజా (59), షాన్ మార్ష్ (54), హ్యాండ్స్ కోంబ్ (73) హాఫ్ సెంచరీలు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్‌, కుల్దీప్‌ల‌కి రెండు వికెట్స్ పడగొట్టగా... జ‌డేజాకు ఒక్క వికెట్ లభించింది.

Story first published: Saturday, January 12, 2019, 16:42 [IST]
Other articles published on Jan 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X