న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australa: నాగ్‌పూర్ వన్డేలో ధోని గోల్డెన్ డకౌట్

India Vs Australia 2nd ODI : MS Dhoni Falls For Fifth Golden Duck In ODI Career
India vs Australa: MS Dhoni falls for fifth golden duck in ODI career

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్ రూపంలో పెవిలియన్ చేరాడు. కేదార్‌ జాదవ్‌(11) ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని.. తాను ఆడిన తొలి బంతికే ఔట్‌ అయ్యాడు.

<strong>వన్డే గురించి నువ్వు మాట్లాడుతున్నావా?: మంజ్రేకర్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు</strong>వన్డే గురించి నువ్వు మాట్లాడుతున్నావా?: మంజ్రేకర్‌ను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు

ఆడమ్‌ జంపా వేసిన 33 ఓవర్‌ మూడో బంతిని కవర్స్‌ మీదుగా షాట్‌ ఆడాడు. అయితే, ఫస్ట్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఖవాజా క్యాచ్‌ పట్టడంతో ధోని ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరాడు. తన వన్డే కెరీర్‌లో ధోని ఇలా గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ కావడం ఐదోసారి. అంతేకాదు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ అదే జట్టుపై ధోని గోల్డెన్ డకౌటయ్యాడు.

1
45586
2004లో బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌ వేదికగా

2004లో బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌ వేదికగా

తన 2004లో బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌ వేదికగా జరిగిన వన్డేలో ధోనీ తొలి బంతికే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 2005లో శ్రీలంకతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో, 2007లో మరోసారి శ్రీలంకతో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో, చివరిగా 2010లో వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధోని తొలి బంతికే గోల్డెన్‌ డక్‌గా నిష్క్రమించాడు.

టీమిండియా 250 ఆలౌట్

టీమిండియా 250 ఆలౌట్

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా విరాట్ కోహ్లి (116 : 120 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ సాధించడంతో 48.2 ఓవర్లలోనే 250 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (0), శిఖర్ ధావన్ (21)తో పాటు అంబటి రాయుడు (18) విఫలమయ్యారు.

వన్డేల్లో కోహ్లీ 40వ సెంచరీ

వన్డేల్లో కోహ్లీ 40వ సెంచరీ

మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా... ఒక్కడే నిలకడగా ఆడుతూ రెండో ఓవర్‌ నుంచి 48వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచిన విరాట్ కోహ్లి జట్టుకి గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కోహ్లీతో పాటు విజయ్ శంకర్ (46 ) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. తొలి వన్డేలో అజేయ అర్ధశతకాలతో భారత్ జట్టుని గెలిపించిన కేదార్ జాదవ్ (11), మహేంద్రసింగ్ ధోనీ వరుస బంతుల్లో ఔటయ్యారు.

విజయ్ శంకర్ రనౌట్‌

విజయ్ శంకర్ రనౌట్‌

కోహ్లీ ఆడిన స్ట్రైట్ డ్రైవ్‌కి విజయ్ శంకర్ రనౌట్‌గా వెనుదిరగడం మ్యాచ్‌లో కీలక మలుపు. ఆ తర్వాత రెండు పరుగుల వ్యవధిలోనే కుల్దీప్ యాదవ్ (3), జస్‌ప్రీత్ బుమ్రా (0) వికెట్లను టీమిండియా కోల్పోయింది. ఆస్ట్రేలియా జట్టులో పాట్ కమిన్స్ నాలుగు వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా రెండు, కౌల్టర్‌ నైల్, మాక్స్‌వెల్, నాథన్ లయన్ తలో వికెట్ తీశారు.

అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లీ

అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లీ

2014-15‌లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ నుంచి జట్టు పగ్గాలు అందుకున్న విరాట్ కోహ్లీ.. కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 9,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. కేవలం 159 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకోగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఏ జట్టు కెప్టెన్‌ ఇంత వేగంగా కనీసం 7 పరుగుల మార్క్‌ని కూడా చేరుకోలేకపోయారు.

Story first published: Tuesday, March 5, 2019, 17:32 [IST]
Other articles published on Mar 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X