ఇంగ్లాండ్‌పై ఘన విజయం: మూడు వన్డేల సిరిస్ భారత్‌దే

Posted By:
India v England, 3rd women’s ODI as it happened: Mithali Raj leads India to a series win

హైదరాబాద్: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరిస్‌ను మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు 2-1తేడాతో కైవసం చేసుకుంది. సిరిస్‌లో భాగంగా గురువారం నాగ్‌పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిథాలీసేన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

మూడు వన్డేల సిరిస్‌ను నెగ్గిన భారత్

దీంతో మూడు వన్డేల సిరిస్‌ను దక్కించుకుంది. మూడో వన్డేలో టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. భారత బౌలర్లు జులన్‌ గోస్వామి, గైక్వాడ్‌, దీప్తి శర్మ, పూనమ్‌ యాదవ్‌‌ చక్కగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధి జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేశారు.

భారత విజయ లక్ష్యం 203

భారత విజయ లక్ష్యం 203

ఈ నలుగురు తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 202 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీసేనకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్ మూడో బంతికే భారత ఓపెనర్‌ రోడ్రిక్స్‌(2) పరుగులకే పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వేదా కృష్ణమూర్తి (7) స్వల్ప స్కోరుకే ఔటైంది.

రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌‌కు చేరిన స్మృతి మందాన

రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌‌కు చేరిన స్మృతి మందాన

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మిథాలీ రాజ్‌ మరో ఎండ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మందానతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దింది. ఈ క్రమంలో స్మృతి మందాన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. దీంతో ఈ ఏడాది స్మృతి మందాన వన్డేల్లో 500 పరుగులు పూర్తి చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే స్మృతి మందాన రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌‌కు చేరింది.

2-1తో మూడు వన్డేల సిరిస్ కైవసం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(54), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(74)తో కలిసి మరో 28 బంతులు మిగిలుండగానే జట్టుకు విజయాన్ని అందించారు. మూడు వన్డేల సిరిస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలవడంతో మూడో వన్డేలో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే, చివరకు మూడో వన్డేని భారత్ కైవసం చేసుకుని వన్డే సిరిస్‌ను కూడా సొంతం చేసుకుంది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Thursday, April 12, 2018, 17:05 [IST]
Other articles published on Apr 12, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి