న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కివీస్ పర్యటన కోహ్లీసేనకు ఓ సవాల్: షెడ్యూల్, మ్యాచ్ టైమింగ్స్, టీవీ టెలికాస్ట్ డిటేల్స్!

India Vs New Zealand 2020 Full Schedule & Match Timings ! || Oneindia Telugu
 India tour of New Zealand 2020: Complete schedule, match timings and TV telecast details

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరిస్ ముగిసింది. ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో నాలుగు రోజుల్లో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ పర్యటన అంటేనే సవాల్‌తో కూడుకుని ఉంటుంది.

అందుకు కారణం కివీస్ గడ్డపై స్వింగ్‌, సీమ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉంటాయి. మరోవైపు వణికించే చలి... న్యూజిలాండ్ వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కివీస్ పర్యటన టీమిండియాకు ఓ సవాలేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. చాలా రోజుల తర్వాత టీమిండియా ఓ సుదీర్ఘ విదేశీ పర్యటనకు బయల్దేరనుంది.

స్మిత్‌కు అంత సీన్ లేదు.. కోహ్లీనే ఆల్‌టైమ్ బెస్ట్ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్స్మిత్‌కు అంత సీన్ లేదు.. కోహ్లీనే ఆల్‌టైమ్ బెస్ట్ : ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

కివీస్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు

కివీస్ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరగనుంది. 2009, 2019 సిరీస్‌లను పక్కన పెడితే న్యూజిలాండ్‌లో అడుగుపెట్టి టీమిండియా వన్డే సిరీస్‌ గెలిచిన దాఖలాలు లేవు.

కివీస్ పర్యటన ఎంతో కష్టం!

కివీస్ పర్యటన ఎంతో కష్టం!

అప్పడెప్పుడో 1967లో టెస్టుల్లో 3-1తో కైవసం చేసుకున్న టీమిండియా 2009లో కివీస్ గడ్డపై టెస్టు సిరిస్‌ను నెగ్గింది. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు టెస్టు సిరిస్ నెగ్గిన దాఖలా లేదు. కివీస్ గడ్డపై టీమిండియా ఇప్పటివరకు ఐదు టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలు చాలు కివీస్ పర్యటన ఎంత కష్టమో.

ఇషాంత్ శర్మ దూరమే

ఇషాంత్ శర్మ దూరమే

అయితే, ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా బలమైన బ్యాటింగ్ లైనప్‌తో పాటు పేస్ బౌలింగ్ విభాగాన్ని కలిగి ఉండటం కలిసొచ్చే అంశం. అయితే, న్యూజిలాండ్ పర్యటనకు ముందు స్టార్ పేసర్, టెస్ట్ స్పెషలిస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గాయపడటం టీమిండియాను ఇబ్బంది పెడుతోంది. దీంతో ఇషాంత్‌ కివీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడేది అనుమానంగా ఉంది.

టీ20 షెడ్యూల్

టీ20 షెడ్యూల్

1st T20I - జనవరి 24 (శుక్రవారం): ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌ (12:30 PM IST)

2nd T20I - జనవరి 26 (ఆదివారం): ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌ (12:30 PM IST)

3rd T20I - జనవరి 29 (బుధవారం): హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌ (12:30 PM IST)

4th T20I - జనవరి 31 (శుక్రవారం): వెల్లింగ్‌టన్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియం (12:30 PM IST)

5th T20I - ఫిబ్రవరి 2 (ఆదివారం): మౌంట్ మౌంగనుయ్ బే ఓవల్ (12:30 PM IST)

వన్డే షెడ్యూల్

1st ODI - ఫిబ్రవరి 5 (బుధవారం): హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో (7:30 AM IST)

2nd ODI - ఫిబ్రవరి 8 (శనివారం): ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో (7:30 AM IST)

3rd ODI - ఫిబ్రవరి 11 (మంగళవారం): మౌంట్ మౌంగనుయ్ బే ఓవల్ వద్ద (7:30 AM IST)

ఫిబ్రవరి 14-16: మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్, సెడాన్ పార్క్, హామిల్టన్ (3:30 AM IST)

టెస్ట్ షెడ్యూల్

1st Test - ఫిబ్రవరి 21-25: బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ (4:00 AM IST)

2nd Test - ఫిబ్రవరి 29-మార్చి 4: హాగ్లీ ఓవల్, క్రైస్ట్‌చర్చ్ (4:00 AM IST)

టీవీ టెలికాస్ట్

టీవీ టెలికాస్ట్

Star Sports 1/HD, Star Sports 2/HD

లైవ్ స్ట్రీమింగ్: హాట్‌స్టార్ యాప్‌లో

టీ20 జట్ల వివరాలు

టీ20 జట్ల వివరాలు

భారతదేశం: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దుబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్.

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), హమీష్ బెన్నెట్, టామ్ బ్రూస్ (4-5 ఆటలకు), కోలిన్ డి గ్రాండ్‌హోమ్ (1-3 ఆటలకు), మార్టిన్ గుప్టిల్, స్కాట్ కుగ్గెలీజ్న్, డారిల్ మిచెల్, కోలిన్ మున్రో, రాస్ టేలర్, బ్లెయిర్ టిక్నర్ , మిచెల్ సాంట్నర్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఇష్ సోధి, టిమ్ సౌతీ.

వన్డే, టెస్టు జట్లను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Story first published: Tuesday, January 21, 2020, 12:51 [IST]
Other articles published on Jan 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X