న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియా పర్యటనకు కోహ్లీసేన: షెడ్యూల్ విడుదల, డే నైట్ టెస్ట్ ఆడేనా?

By Nageshwara Rao
India Tour of Australia 2018-19: India to play 3 T20Is, 4 Tests and 3 ODIs

హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ ముగిసిన తర్వాత కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా విదేశీ పర్యటనలతో బిజీ బిజీగా గడపనుంది. ఐపీఎల్‌ అనంతరం టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్‌ పర్యటనుకు వెళ్లనుంది. జులైలో ఈ పర్యటన ప్రారంభం కానుంది.

ఆ తర్వాత ఈ ఏడాది చివర్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరనుంది. ఇందులో భాగంగా కోహ్లీసేన ఆసీస్ పర్యటనకు సంబంధించి క్రికెట్‌ ఆస్ట్రేలియా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా కోహ్లీసేన ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

ఈ పర్యనటలో భాగంగా ఇరు జట్ల మద్య జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఓ డే నైట్‌ టెస్ట్‌ కోసం బీసీసీఐని క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ సందర్భంగా సీఏ సీఈవో జేమ్స్‌ సదర్లాండ్‌, బోర్డు అధికారులు అడిలైడ్‌ వేదికగా జరిగే భారత్‌-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ను డేనైట్‌ నిర్వహించే దిశగా బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

'భారత్‌ తో అడిలైడ్‌ వేదికగా జరిగే టెస్టును డే నైట్‌ నిర్వహించాలని మేం భావిస్తున్నాం. ఆ దిశగా మా ప్రయత్నాలు చేపట్టాం. మరి కొద్ది రోజుల్లో ఈ విషయం స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం' అని జేమ్స్‌ సదర్లాండ్‌ తెలిపారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌ డిసెంబర్‌ 6 నుంచి 10 మధ్య జరగనుంది.

టీ20 సిరీస్‌తో భారత్‌ తన పర్యటనను ప్రారంభించనుంది. ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు జరగనుంది. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా ఆడే మూడు సిరిస్‌ల్లో కూడా ఆస్ట్రేలియా కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఆడరు.

బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా వీరిద్దరిపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం మార్చి, 2019లో ముగియనుంది. దీంతో వీరు ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. మరోవైపు ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్‌క్రాఫ్ట్‌ భారత్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు.

ఆస్ట్రేలియాలో భారత పర్యటన షెడ్యూల్:
* November 21 - Australia v India, The Gabba, 1st T20I
* November 23 - Australia v India, MCG, 2nd T20I
* November 25 - Australia v India, SCG, 3rd T20I

* December 6-10 - Australia v India, Adelaide Oval, 1st Test
* December 14-18 - Australia v India, Perth Stadium, 2nd Test
* December 26-30 - Australia v India, MCG, 3rd Test
* January 3-7 - Australia v India, SCG, 4th Test

* January 12 - Australia v India, SCG, 1st ODI
* January 15 - Australia v India, Adelaide Oval, 2nd ODI
* January 18 - Australia v India, MCG, 3rd ODI

Story first published: Tuesday, November 13, 2018, 12:21 [IST]
Other articles published on Nov 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X