న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India T20 WC Squad: జస్‌ప్రీత్ బుమ్రా గాయానికి కారణం అదేనా?

India T20 WC Squad: Reason behind Jasprit Bumrah back stress fracture

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ టైటిలే లక్ష్యంగా సన్నదమవుతున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. తమ ప్రణాళికల్లో ఉన్న ప్రధాన పేసర్ జస్‌‌ప్రీత్ బుమ్రా అనూహ్యంగా గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకొని జట్టులోకి వచ్చిన బుమ్రా.. రెండు మ్యాచ్‌ల వ్యవధిలోనే మరోసారి తీవ్రంగా గాయపడి మెగా టోర్నీకి దూరమయ్యాడు. మరో 20 రోజుల వ్యవధిలో మెగాటోర్నీకి తెరలేవనుండగా.. బుమ్రా ఇలా గాయంతో దూరమవడం టీమిండియాను కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే బుమ్రా గాయంపై బీసీసీఐ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ జట్టు వర్గాలు మాత్రం అతని వెన్ను ఫ్రాక్చర్ అయినట్లు పేర్కొన్నాయి. సర్జరీ అవసరం లేకున్నా కనీసం 4-5 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు పేర్కొన్నాయి.

రెండు మ్యాచ్‌ల వ్యవధిలోనే..

రెండు మ్యాచ్‌ల వ్యవధిలోనే..

అయితే రెండు మ్యాచ్‌ల వ్యవధిలోనే బుమ్రా ఇలా తీవ్రంగా గాయపడటం అనేక సందేహాలకు తావిస్తుంది. అసలు బుమ్రా గాయపడటానికి అసలు కారణం బీసీసీఐ‌తో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ అత్యుత్సాహమనే చర్చ తెరపైకి వచ్చింది. మెగా టోర్నీ కోసం సెలెక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్ తొందరపడటంతోనే బుమ్రా సేవలు కోల్పోవాల్సి వచ్చిందనే అభిప్రాయం వినిపిస్తోంది. జూలైలో ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతి పేరిట ఆటకు దూరమైన బుమ్రా.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. జింబాబ్వే పర్యటనకు వెళ్లలేదు. ఆసియాకప్‌లో ఫ్రెష్‌గా ఆడించాలనే ప్రణాళికతో టీమ్‌మేనేజ్‌మెంట్ అతనికి కావాల్సినంత విశ్రాంతినిచ్చింది.

బీసీసీఐ తొందరపాటు..

బీసీసీఐ తొందరపాటు..

అయితే బ్రేక్‌లో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆసియాకప్ ముంగిట బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. వెంటనే బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లి రిహాబిలిటేషన్ తీసుకున్నాడు. మెగా టోర్నీ నేపథ్యంలో బీసీసీఐ సైతం ఆసియా కప్ నుంచి అతనికి విశ్రాంతిని కల్పించింది. అయితే ఆసియాకప్‌లో భారత్ ఘోరంగా విఫలమవ్వడం... బౌలింగ్ విభాగం మరీ బలహీనంగా మారడంతో బుమ్రాను తీసుకొచ్చేందుకు సెలెక్టర్లు, టీమ్‌మేనేజ్‌మెంట్ తొందరపడ్డారు. ఈ క్రమంలోనే అతను పూర్తిగా కోలుకోకముందే మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఆడించాలని ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేశారు.

పూర్తిగా కోలుకోక ముందే..

పూర్తిగా కోలుకోక ముందే..

పూర్తిగా కోలుకోకపోవడంతో తొలి మ్యాచ్‌కు పక్కనపెట్టి రెండో మ్యాచ్‌ ఆడించారు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన బుమ్రా.. ఓ వికెట్‌ తీసి రిథమ్‌లో కనిపించాడు. అయితే పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడంతో వెన్నులో మరింత ఒత్తిడి పెరిగి ఫ్రాక్చర్‌కు దారితీసింది. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో ఈ విషయం స్పష్టమైంది. బౌలింగ్ చేయడంలో అసౌకర్యంగా కనిపించిన బుమ్రా ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. కెరీర్‌లో ఎన్నడు లేనివిధంగా ధారళంగా పరుగులిచ్చి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఇక సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు వెన్ను నొప్పి వస్తుందని చెప్పడంతో విశ్రాంతినిచ్చారు. తీరా గాయం తీవ్రత ఎక్కువ అవడంతో సిరీస్‌లోని మిగతా రెండు మ్యాచ్‌లతో పాటు మెగా టోర్నీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే బీసీసీఐ తొందరపాటు వల్లే బుమ్రా సేవలు కోల్పోవాల్సి వచ్చిందనేది స్పష్టంగా తెలుస్తోంది.

Story first published: Thursday, September 29, 2022, 19:10 [IST]
Other articles published on Sep 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X