న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'దేశ ప్రజల మనోభావాల కంటే వరల్డ్‌కప్ ఎక్కువ కాదు'

Mohammad Azharuddin Says 'World Cup Not Bigger Than Country,' | Oneindia Telugu
India should not play Pakistan anywhere, World Cup is not bigger than the country: Mohammad Azharuddin

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వరల్డ్‌కప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, చేతన్‌ చౌహాన్ స్పందించగా... తాజాగా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ సైతం స్పందించాడు.

<strong>పుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్: పాక్‌తో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదు: గంగూలీ</strong>పుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్: పాక్‌తో మ్యాచ్ ఆడే ప్రసక్తే లేదు: గంగూలీ

ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో అజహరుద్దీన్ మాట్లాడుతూ "పాక్‌తో భారత క్రికెట్ జట్టు ఏ టోర్నీలోనూ ఆడకూడదు. నేను హర్భజన్‌తో ఏకీభవిస్తున్నా. దేశ ప్రజల మనోభావాల కంటే వరల్డ్‌కప్ ఎక్కువకాదు. మన జవాన్ల కుటుంబాలను చూసి మనం ఇక్కడ కన్నీరు పెడుతుంటే పాకిస్థాన్‌ కనీసం జాలి కూడా చూపించడం లేదు" అని అన్నాడు.

చాలా దేశాలు అండగా

చాలా దేశాలు అండగా

"ఎన్నో దేశాలు పుల్వామా ఉగ్రగాడి ఘటన అనంతరం మనకు అండగా ఉంటామని చెప్పాయి. కానీ పాక్‌ మాత్రం కనీసం పలకరించలేదు. అలాంటి దేశ జట్టుకు మనతో ఆడే అర్హత లేదు. మనం ఇక్కడ క్రికెట్‌ మ్యాచ్‌ గెలిస్తే జవాన్లు అక్కడ సంబరాలు చేసుకుంటారు. క్రికెట్‌కు వాళ్లు అంత గౌరవం ఇస్తున్నప్పుడు మనం దానిని కాపాడుకోవాలి" అని అజహరుద్దీన్ అభిప్రాయపడ్డాడు.

భారత్-పాక్ దేశాలు ఎక్కడా మ్యాచ్‌లు ఆడకూడదు

భారత్-పాక్ దేశాలు ఎక్కడా మ్యాచ్‌లు ఆడకూడదు

"భారత్-పాక్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ జరగకపోతే ఇంకెక్కడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు జరగకూడదు. ఐసీసీ, బీసీసీఐ ఈ విషయంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి" అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఈ ఏడాది వరల్డ్‌కప్‌‌ను ఐసీసీ రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహిస్తోంది. ఈ విధానం ప్రకారం టోర్నీలో పాల్గొంటోన్న ఒక జట్టు మిగతా అన్ని జట్లతో ఆడాలి.

భారత్-పాక్ మ్యాచ్ ఆడకపోతే!

భారత్-పాక్ మ్యాచ్ ఆడకపోతే!

టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. అంటే ఒక్కో జట్టు తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. చివరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన దేశాలు సెమీస్‌లో తలపడతాయి. ఆ తర్వాత ఫైనల్‌ జరుగుతుంది. పాక్‌తో మ్యాచ్‌ రద్దు చేసుకున్నా తొలి నాలుగు స్థానాల్లో నిలిస్తే ఫర్వాలేదు. అలా కాకుండా మిగతా జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ ఓడితే మాత్రం సెమీస్‌ చేరుకొనే అవకాశాలు చేజారుతాయి.

Story first published: Thursday, February 21, 2019, 13:37 [IST]
Other articles published on Feb 21, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X