న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో రోజు తొలి బంతికే టీమిండియా ఆలౌట్, స్కోరు 250

India all out for 250 in first Test against Australia

అడిలైడ్‌: అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ 250 పరుగులతోనే సరిపెట్టుకుంది. మొదటి రోజు 9 వికెట్ల నష్టానికి 250 పరుగులకు ముగించిన భారత్‌ రెండో రోజు ఖాతా తెరవకుండానే ఇన్నింగ్స్‌ను ముగించింది. రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ మొదటి బంతికే షమీ వికెట్‌ కొల్పోయి ఆలౌటైంది. హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో మహ్మద్‌ షమీ పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 9 వికెట్ల న‌ష్టానికి 250 ప‌రుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (123: 246 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సు) వీరోచిత సెంచరీతో భారత్ పరువు నిలిపాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో షమీ(6), బుమ్రా (0) ఉన్నారు.

1
43623
పేలవంగా ఆరంభించిన ఓపెనర్లు

పేలవంగా ఆరంభించిన ఓపెనర్లు

గురువారం ఉదయం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా దిగిన కేఎల్ రాహుల్, మురళీ విజయ్‌లు శుభారంభాన్ని నమోదు చేయలేకపోయారు. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి (3), ఓపెనర్లు మురళీ విజయ్ (11), కేఎల్ రాహుల్ (2), రహానె (13) విఫలమైనా.. రోజంతా పట్టుదలతో క్రీజులో నిలిచాడు. 87.5 ఓవర్ల వద్ద పుజారా రనౌటవడంతో.. గురువారం ఆటని అంపైర్లు ముగించేశారు.

కోహ్లీ కూడా సింగిల్ డిజిట్ స్కోరుతో

కోహ్లీ కూడా సింగిల్ డిజిట్ స్కోరుతో

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. ఇటీవల ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదరగొట్టిన ఓపెనర్లు తొలి 7 ఓవర్లలోనే పెవిలియన్‌కి చేరిపోగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లి కూడా నిరాశపరిచాడు. దీంతో.. అప్పటికే క్రీజులోకి వచ్చిన పుజారా.. రహానెతో కలిసి కాసేపు ఇన్నింగ్స్‌ని నడిపించాడు. కానీ.. రహానె కూడా జట్టు స్కోరు 41 వద్ద వెనుదిరిగాడు. దీంతో.. 20.2 ఓవర్లలో 41/4తో భారత్ కష్టాల్లో పడింది.

పూజారా తర్వాత రోహిత్‌దే అధిక స్కోరు

పూజారా తర్వాత రోహిత్‌దే అధిక స్కోరు

ఈ దశలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ (37: 61 బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సులు)తో కాసేపు మెరుపులు మెరిపించి.. భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. పూర్తిగా వన్డే ఫార్మాట్‌లోకి వెళ్లిపోయిన రోహిత్ శర్మ.. వరుస సిక్సర్ల కోసం ప్రయత్నించి స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కానీ, పూజారా (123)తర్వాత జట్టులో అత్యధిక స్కోరు నమోదు చేసింది రోహిత్ మాత్రమే. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ (25: 38 బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సు)తో అదే బాటలో పెవిలియన్ చేరాడు.

పార్టనర్ మారుతున్నా.. తడబడకుండా

పార్టనర్ మారుతున్నా.. తడబడకుండా

మళ్లీ 127/6తో భారత్‌కి కష్టాలు మొదలయ్యాయి. పంత్ ఔట్ తర్వాత వచ్చిన అశ్విన్‌ (25: 76 బంతుల్లో 1ఫోర్)తో సరిపెట్టుకున్నా.. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ మారుతున్నా తను మాత్రం స్థిరబడిపోయాడు. ఇలా కీలక ఇన్నింగ్స్‌ ఆడిన పూజారా.. భారత్‌‍‌ను 200 పరుగులకు చేరువ చేశాడు. కానీ.. అశ్విన్‌ని తెలివిగా.. పాట్ కమిన్స్ ఔట్ చేయగా.. అప్పటికే సెంచరీ పూర్తి చేసేసుకన్న పూజారా బ్యాట్ ఝళిపించడం మొదలెట్టాడు.

షమీ వికెట్‌తో 250కి ఆలౌట్

షమీ వికెట్‌తో 250కి ఆలౌట్

కెరీర్‌లో 16వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మధ్యలో ఇషాంత్ శర్మ (4), షమీ (6 బ్యాటింగ్) అతనికి చక్కటి సహకారం అందించారు. మరికొన్ని నిమిషాల్లో గురువారం ఆట ముగుస్తుందన్న దశలో లేని పరుగు కోసం యత్నిస్తూ.. పాట్ కమిన్స్ మెరుపు ఫీల్డింగ్‌కి పుజారా రనౌట్‌గా ఇన్నింగ్స్‌ను చాలించాడు. ఇక శుక్రవారం ఆట ఆరంభించక ముందే షమీ తొలి వికెట్‌ను సమర్పించుకున్న భారత్ ఆలౌట్‌గా ముగించింది. ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, కమిన్స్‌, లైయన్‌ తలో రెండు వికెట్లు తీశారు.

Story first published: Friday, December 7, 2018, 7:21 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X