For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs ఆసీస్: కోట్లాలో గత రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?

India Vs Australia 2019, 5th ODI : Team India Has Good Record In Feroz Shah Kotla Ground | Oneindia
India or Australia? Head-to-head record ahead of 5th ODI at Feroz Shah Kotla

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే నిర్ణయాత్మక ఆఖరి వన్డే‌కి సర్వం సిద్ధమైంది. ఈ సిరిస్‌లో చివరిదైన ఆఖరి వన్డేకి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఆతిథ్యమిస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ఢిల్లీకి చేరుకున్నాయి.

ఈ సిరిస్‌లో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం అయింది. దీంతో ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. కాగా, ఆఖరి వన్డేకి ఆతిథ్యమిస్తోన్న ఫిరోజ్ షా కోట్లాలో రికార్డుల పరంగా చూసుకుంటే ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయిగా కనిపిస్తోంది.

1986 నుంచి కోట్లాలో ఈ రెండు జట్లూ ఐదు వన్డేల్లో తలపడగా భారత్ మూడింట్లో, ఆస్ట్రేలియా రెండింట్లో విజయం సాధించింది. చివరిగా అక్టోబరు 31, 2009లో ఇరు జట్లు తలపడగా.... ఆ మ్యాచ్‌లో భారత్ 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మైక్ హస్సీ (81), పాంటింగ్ (59) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం చేధననలో భారత జట్టులో యువరాజ్ సింగ్ (78), మహేంద్రసింగ్ ధోనీ (71 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 48.2 ఓవర్లలోనే విజయం సాధించింది.

Story first published: Tuesday, March 12, 2019, 16:11 [IST]
Other articles published on Mar 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+