న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సముద్ర తీరాన ధావన్ వేణుగానం.. అభిమానులు ఫిదా (వీడియో)!!

India Openar Shikhar Dhawan plays flute, mesmerises fans with music

తిరువనంతపురం: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ తనలోని మరో కొత్త కోణంను అబిమానులకు పరిచయం చేసాడు. సముద్ర తీరాన ధావన్ వేణుగానంతో అభిమానులను పరవశింపజేశాడు. ధావన్‌ వేణుగానంతో అభిమానులు ఫిదా అయి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విషయంలోకి వెళితే.

పాకిస్థాన్‌ హెడ్ కోచ్‌గా మిస్బాకే పట్టం.. బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌పాకిస్థాన్‌ హెడ్ కోచ్‌గా మిస్బాకే పట్టం.. బౌలింగ్ కోచ్‌గా వకార్ యూనిస్‌

విండీస్‌ పర్యటనలో విఫలం:

ధావన్‌ ప్రపంచకప్‌-2019లో ఆస్ట్రేలియాపై సూపర్ సెంచరీతో అలరించాడు. అయితే అదే మ్యాచ్‌లో బొటనవేలికి గాయం కావడంతో.. ప్రపంచకప్‌ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించి చికిత్స తీసుకుని కోలుకున్నాడు. దీంతో వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికయ్యాడు. టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కలేదు. విండీస్‌ గడ్డపై 2 వన్డేలలో కలిపి 38 పరుగులు, 3 టీ20లలో ధావన్ 27 పరుగులే చేశాడు.

సముద్ర తీరాన ధావన్:

సముద్ర తీరాన ధావన్:

బీసీసీఐ సెలక్టర్లు ధావన్‌ను టెస్టు జట్టులో ఎంపిక చేయకపోయినా.. దక్షిణాఫ్రికా-ఎతో జరిగే చివరి రెండు అనధికారిక వన్డేలకు భారత-ఎ జట్టులో స్థానం కల్పించారు. ప్రస్తుతం గబ్బర్ కేరళలోని తిరువనంతపురంలో ఉన్నాడు. మ్యాచ్‌లకు సమయం ఉండడంతో ధావన్‌ తనలోని సంగీతకారున్ని పరిచయం చేసాడు. సముద్ర అలలు పైకి లేస్తుండగా.. తీరంలో కొబ్బరి చెట్లు గాలి వీస్తుండగా.. ఓ బంగ్లా పైన ఉన్న ధావన్‌ వేణుగానం వినిపించాడు.

 మూడేళ్లుగా వేణుగానం:

మూడేళ్లుగా వేణుగానం:

దీనికి సంబందించిన వీడియోను ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసాడు. 'కొత్త ఆరంభం.. చెట్లు.. గాలి.. సముద్రం.. కొంత సంగీతం = ఆనందం' అని రాసుకొచ్చాడు .గబ్బర్‌ వేణుగానంతో అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. 'నిజంగా మీరేనా' అని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. మూడేళ్లుగా ధావన్ వేణుగానం నేర్చుకుంటున్నాడు. త్వరలో జరిగే దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు.

Story first published: Wednesday, September 4, 2019, 14:53 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X