న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జనవరి 24న దక్షిణాఫ్రికా పర్యటనకు భారత వన్డే స్పెషలిస్టులు

By Nageshwara Rao
India ODI Specialists To Board Flight To South Africa On January 24

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ అనంతరం ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 1 నుంచి ఆరు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వన్డే సిరిస్ కోసం జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు జనవరి 24న దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.

ఇప్పటికే దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరిస్‌ ఆడుతున్న పలువురు ఆటగాళ్ల వన్డే జట్టులో కూడా చోటు దక్కించుకున్నారు. వాళ్లు కాకుండా స్వదేశంలో ఎవరైతే ఆటగాళ్లు ఉన్నారో వారంతా వచ్చే వారంలో సఫారీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ జాబితాలో ధోని, శ్రేయాస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌లు ఉన్నారు.

నిజానికి టెస్టు సిరిస్ ప్రారంభానికి ముందు కొంత మంది ఆటగాళ్లను బోర్డు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లమని చెప్పినప్పటికీ, జట్టు మేనేజ్‌మెంట్ అలా చేయలేదు. దీంతో దక్షిణాఫ్రికా పరిస్థితులకు అలవాటు పడక పోవడం వల్లే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 0-2తో కోహ్లీసేన చేజార్చుకుందని విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో వన్డే జట్టుని వారం రోజులు ముందుగానే పంపాలని బోర్డు భావించి జనవరి 24న వన్డే స్పెషలిస్టులను పంపేందుకు ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ఇరు జట్ల మధ్య జనవరి 24న జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది.

టెస్టు సిరిస్ అనంతరం ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన ఆరు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడనుంది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 20, 2018, 16:31 [IST]
Other articles published on Jan 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X