న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2023 వరల్డ్ కప్‌కు భారతే ఆతిథ్యమిస్తుంది: ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్

India in no danger of losing World Cup 2023 rights: ICC

హైదరాబాద్: 2021 చాంపియన్స్ ట్రోఫీ, 2023 వరల్డ్ కప్‌కు భారతే ఆతిథ్యమిస్తుందని ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్‌సన్ స్పష్టం చేశారు. 2016 టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వకపోవడంతో బీసీసీఐని రూ. 161 కోట్లు చెల్లించాలని ఐసీసీ కోరింది. లేదంటే ఈ రెండు మెగా ఈవెంట్ల ఆతిథ్యాన్ని కోల్పోతారని హెచ్చరికలు జారీ చేసింది. అయితే, తాజాగా గురువారం వరల్డ్‌కప్ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ అవన్నీ అవాస్తవాలేనని, ఆతిథ్య హక్కులను భారత్ కోల్పోదని తెలిపారు.

టోర్నీల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని

టోర్నీల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని

టోర్నీల ద్వారా వచ్చే ప్రతి రూపాయిని తిరిగి ఆటలోనే పెడుతామని అన్నారు. విండీస్‌లాంటి దేశాల్లో ఆదాయాన్ని సృష్టించడం సమస్యగా మారిందని చెప్పుకొచ్చారు. భారత్‌లో కచ్చితంగా పన్ను మినహాయింపును సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కోకకోలాతో ఐసీసీ ఐదేళ్ల ఒప్పందాన్ని చేసుకుందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

కోహ్లీ క్రికెట్‌కు అతిపెద్ద రాయబారి

కోహ్లీ క్రికెట్‌కు అతిపెద్ద రాయబారి

ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌కు అతిపెద్ద రాయబారి అని రిచర్డ్‌సన్ చెప్పుకొచ్చారు. టీమిండియా సత్ప్రవర్తన కలిగిన జట్టు అని.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అంశం బీసీసీఐ పరిష్కరిస్తుందని తెలిపారు. ఇది చాలా చిన్న సమస్య అని అన్నారు.

భారత్ జట్టు మంచి ప్రవర్తనతో మెలుగుతుంది

భారత్ జట్టు మంచి ప్రవర్తనతో మెలుగుతుంది

"మైదానంలో భారత్ జట్టు మంచి ప్రవర్తనతో మెలుగుతుంది. అంపైర్ నిర్ణయాలను గౌరవిస్తుంది. క్రీడాస్ఫూర్తితో మ్యాచ్‌లు ఆడుతుంది. జట్టు మొత్తం సమిష్టిగా విజయాల కోసం కష్టపడుతుంది. ఇక కోహ్లీ ఆటకే అతిపెద్ద రాయబారి. టీ20ల గురించే కాకుండా టెస్ట్, వన్డే ఫార్మాట్‌ల గురించి కూడా ఆత్మీయంగా మాట్లాడుతాడు. ఇలాంటి మంచి ఆటగాళ్లందరూ అన్ని ఫార్మాట్లలో ఆడాలని కోరుకుంటున్నాం" అని రిచర్డ్‌సన్ అన్నారు.

ధోనిది కీలక పాత్ర

ధోనిది కీలక పాత్ర

ఇటీవల కాలంలో టీమిండియా ప్రదర్శన, విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ వంటి అంశాలను ఈ సందర్భంగా రిచర్డ్‌సన్ ప్రశంసించారు. టీమిండియా విజయాల్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిది కీలక పాత్ర అని చెప్పిన రిచర్డ్‌సన్, బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆ జట్టు పటిష్టంగా తయారైందని చెప్పారు. స్పిన్నర్లు కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు.

Story first published: Friday, February 1, 2019, 9:33 [IST]
Other articles published on Feb 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X