న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

350, అంతకంటే ఎక్కువ!: వన్డే చరిత్రలో తొలిసారి, టీమిండియా చెత్త రికార్డు

India Vs Australia 4th ODI : India Fail To Defend 350-Plus Score For The 1st Time In ODI History
India fail to defend 350-plus score for the 1st time in their ODI history

హైదరాబాద్: మొహాలీ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు నమోదైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసింది.

<strong>జంపా: అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసిన రెండో స్పిన్నర్</strong>జంపా: అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసిన రెండో స్పిన్నర్

అనంతరం 359 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఇంకా 13 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో వన్డేల్లో 350కి పైగా పరుగుల్ని కాపాడుకోవడంలో భారత్ విఫలమైంది. వన్డే క్రికెట్ చరిత్రలో 350, అంతకంటే ఎక్కువ పరుగుల్ని కాపాడుకోవడంలో భారత క్రికెట్ జట్టు విఫలమవడం ఇదే తొలిసారి.

350, అంతకంటే ఎక్కువ పరుగుల్ని

350, అంతకంటే ఎక్కువ పరుగుల్ని

గతంలో తొలి ఇన్నింగ్స్‌ల్లో 350, అంతకంటే ఎక్కువ పరుగుల్ని ఐదు సందర్భాల్లో భారత్‌ విజయాన్ని సాధించింది. మరోవైపు మొహాలీ వన్డేలో 359 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించడంతో ఆసీస్ ఖాతాలో ఓ రికార్డు నమోదైంది. అత్యధిక పరుగుల ఛేజింగ్‌గా ఆసీస్ రికార్డు సృష్టించింది.

ఆసీస్ ఛేజింగ్‌ చేసిన అత్యధిక పరుగులు 334

ఆసీస్ ఛేజింగ్‌ చేసిన అత్యధిక పరుగులు 334

అంతకుముందు ఆస్ట్రేలియా ఛేజింగ్‌ చేసిన అత్యధిక పరుగులు 334. 2011లో సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించింది. ఇప్పుడు దానిని సవరిస్తూ ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు సృష్టించింది. వన్డేల్లో రెండు జట్లూ 350కి పరుగులు చేయడం ఇది 12వసారి.

అత్యధిక పరుగుల ఛేజింగ్‌ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట

వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల ఛేజింగ్‌ రికార్డు దక్షిణాఫ్రికా పేరిట ఉంది. 2006లో ఆస్ట్రేలియాతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో 435 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛేదించిన సంగతి తెలిసిందే. నాలుగో వన్డేలో టీమిండియా 358 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్ కారణంగా ఓటమిపాలైంది.

ఐదో వన్డే బుధవారం ఢిల్లీలో

ఐదో వన్డే బుధవారం ఢిల్లీలో

నాలుగో వన్డేలో ఓటమితో ఐదు వన్డేల సిరీస్‌ 2-2తో సమం అయింది. సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే ఐదో వన్డే ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి జరగనుంది. ఈ మ్యాచ్‌లో 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులతో 84 నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఆసీస్ ఆటగాడు టర్నర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Monday, March 11, 2019, 14:51 [IST]
Other articles published on Mar 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X