న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో పాకిస్థాన్ రికార్డుని సమం చేసిన టీమిండియా

India equal Pakistan’s unique World Record with 4-wicket win over West Indies

హైదరాబాద్: ప్రపంచకప్ ఓటమిని భారత అభిమానులు త్వరగానే మరిచిపోయేలా చేసింది కోహ్లీసేన. ప్రపంచకప్ అనంతరం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమిండియా 22 పరుగులు తేడాతో విజయం సాధించింది.

తద్వారా మూడు టీ20ల సిరిస్‌ను మరో టీ20 మిగిలుండగానే టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా ఓ అరుదైన రికార్డుని నెలకొల్పింది. పాకిస్థాన్ తర్వాత విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ టీ20ల్లో యాభైకి పైగా విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా అవతరించింది.

<strong>ధోనీని మరపించిన రిషబ్ పంత్: చప్పట్లు కొడుతూ అభినందించిన కోహ్లీ </strong>ధోనీని మరపించిన రిషబ్ పంత్: చప్పట్లు కొడుతూ అభినందించిన కోహ్లీ

63.27 విజయ శాతంతో టీమిండియా

63.27 విజయ శాతంతో టీమిండియా

ఇప్పటివరకు టీమిండియా మొత్తం 116 టీ20లు ఆడగా 63.27 విజయ శాతంతో 71 మ్యాచ్‌లు గెలుపొందింది. ఈ జాబితాలో పాకిస్థాన్‌ జట్టు 143 మ్యాచ్‌ల్లో 90 విజయాలు నమోదు చేసి అగ్రస్థానంలో ఉంది. ఇక, పాక్‌ తర్వాత ఎక్కువ టీ20 మ్యాచ్‌లు గెలుపొందిన భారత జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది.

నాలుగు వికెట్ల తేడాతో విజయం

నాలుగు వికెట్ల తేడాతో విజయం

ఇదిలా ఉంటే వెస్టిండిస్‌తో శనివారం జరిగిన తొలి టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇదే స్టేడియంలో జరిగిన రెండో టీ20లో సైతం టీమిండియా విజయం సాధించి సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఆగస్టు 6న జరగనున్న మూడో టీ20 గుయానా వేదకగా జరగనుంది.

విరామ సమయం.. ఆర్మీ బెటాలియన్‌తో వాలీబాల్ ఆడిన ధోనీ (వీడియో)

హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ

హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (51 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించగా విరాట్ కోహ్లీ (23 బంతుల్లో 28; ఫోర్, సిక్స్‌), కృనాల్‌ పాండ్యా (13 బంతుల్లో 20 నాటౌట్‌; 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.

రావ్‌మన్‌ పావెల్‌ ఒక్కడే

రావ్‌మన్‌ పావెల్‌ ఒక్కడే

విండీస్‌ బౌలర్లలో థామస్‌ (2/27), కాట్రెల్‌ (2/25) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో రావ్‌మన్‌ పావెల్‌ (34 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించగా... మిగతా వారంతా నిరాశ పరిచారు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, పేసర్‌ భువనేశ్వర్‌ తలో వికెట్ తీశారు.

టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ

వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిపివేత

వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిపివేత

విజయానికి 27 బంతుల్లో 70 పరుగులు అవసరమైన దశలో విండీస్‌ 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి వర్తింపజేయగా... వెస్టిండిస్ ఇంకా 22 పరుగులు వెనుకబడి ఉండటంతో టీమిండియాను విజేతగా ప్రకటించారు.

Story first published: Monday, August 5, 2019, 12:39 [IST]
Other articles published on Aug 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X