టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. రైనాను దాటినా కోహ్లీ

లాడర్‌హిల్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. వర్షం వల్ల అర్ధంతరంగా ఆగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 22 పరుగుల తేడాతో నెగ్గింది.

ప్రపంచ రికార్డు బద్దలు:
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (67; 51 బంతుల్లో 6×4, 3×6) అర్ధ సెంచరీ చేసాడు. మూడు సిక్సర్లు బాది టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ (107) రికార్డు సృష్టించాడు. విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్ (105) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ఈ సిరీస్‌కు ముందు రోహిత్ 102 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి టీ20లో రెండు సిక్సర్లు బాదిన రోహిత్.. రెండో టీ20లో మూడు సిక్సర్లతో గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (103) మూడో స్థానంలో ఉన్నాడు. టాప్ ముగ్గురు కూడా ఓపెనర్లే కావడం విశేషం.

కోహ్లీ సరికొత్త రికార్డు:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా టీ20 ఫార్మాట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక బౌండరీలు (225) సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో విరాట్ కోహ్లీ (19) ఒకే ఒక్క బౌండరీ బాదాడు. ఆదివారం జరిగిన రెండో టీ20లో కూడా ఒక బౌండరీ బాదాడు. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. అంతకుముందు శ్రీలంక డాషింగ్ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ (223) పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు.
యాషెస్ తొలి టెస్టు: స్మిత్, వేడ్ సెంచరీలు.. ఇంగ్లండ్ లక్ష్యం 398

రైనాను దాటినా కోహ్లీ:
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు సురేశ్ రైనా (8,392) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లీ (8,416) అధిగమించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ధ సెంచరీల భాగస్వామ్యాన్ని అందించిన రెండో జోడీ రోహిత్-ధవన్ (10). గప్టిల్-విలియమ్సన్ (11) మొదటి స్థానంలో ఉన్నారు. 12 రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న ద్వైపాక్షిక టి20 సిరీస్‌లను భారత్ 12 సార్లు సొంతం చేసుకుంది.

భారత్ విజయం:
ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ వెస్టిండీస్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. రోహిత్ (51), కోహ్లీ (28), పాండ్యా ( 20 నాటౌట్) రాణించారు. భారత బౌలర్ల దెబ్బకు ఆదిలోనే వికెట్లు కోల్పోయిన విండీస్.. 98/4తో ఉన్న స్థితిలో వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేశారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విండీస్ ఇంకా 22 పరుగులు వెనుకబడి ఉండడంతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications