న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొదటి సెంచరీ రైనాదే: టీ20ల్లో టీమిండియా ఎన్ని చేసిందో తెలుసా?

By Nageshwara Rao
India's T20 Centuries List
India beat England in first T20I: List of India’s T20I hundreds

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీసేన శుభారంభం చేసింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో బంతితో కుల్దీప్‌ యాదవ్‌ (5/24) మెరవగా, బ్యాటుతో కేఎల్‌ రాహుల్‌ (101 నాటౌట్‌) రాణించడంతో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జోస్ బట్లర్‌ (69) చెలరేగినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలం కావడంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది.

అనంతరం కేఎల్ రాహుల్ అజేయ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 18.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. తొలి ఓవర్‌లో ధావన్(4) ఔటైనా... ఆ తర్వాత కేఎల్ రాహుల్ ఫోర్లు, సిక్స్‌లతో మురిపించాడు. టీ20ల్లో కేఎల్ రాహుల్‌కి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

2006లో టీమిండియా ఈ పొట్టి ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుగురు భారత ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేసిన మ్యాచ్‌ల్లో మూడు సార్లు టీమిండియా విజయం సాధించగా, రెండు సార్లు ఓటమి పాలైంది.

టీమిండియా తరుపున టీ20ల్లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా సురేశ్ రైనా నిలిచాడు. ఆ తర్వాత భారత్ తరుపున రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు రెండేసి సార్లు సెంచరీలతో మెరిశారు.

 సురేశ్ రైనా (60 బంతుల్లో 101 పరుగులు)

సురేశ్ రైనా (60 బంతుల్లో 101 పరుగులు)

2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో సురేశ్ రైనా 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. స్ట్రయిర్ రేట్ 168.33గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ(66 బంతుల్లో 106 పరుగులు)

రోహిత్ శర్మ(66 బంతుల్లో 106 పరుగులు)

2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 12 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. స్ట్రయిర్ రేట్ 160.60గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 110 నాటౌట్)

కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 110 నాటౌట్)

2016, ఆగస్టులో వెస్టిండిస్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 12 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. స్ట్రయిర్ రేట్ 215.68గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ(43 బంతుల్లో 118 పరుగులు)

రోహిత్ శర్మ(43 బంతుల్లో 118 పరుగులు)

2017, డిసెంబర్ నెలలో శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 12 ఫోర్లు, 10 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. స్ట్రయిర్ రేట్ 274.41గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది.

కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 101 నాటౌట్)

కేఎల్ రాహుల్ (54 బంతుల్లో 101 నాటౌట్)

2017, జులై నెలలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 10 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో సెంచరీని నమోదు చేశాడు. స్ట్రయిర్ రేట్ 187.03గా నమోదైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(5/24) బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లలో కేఎల్ రాహుల్‌ (101నాటౌట్) అజేయ సెంచరీతో రాణించడంతో 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

Story first published: Wednesday, July 4, 2018, 18:20 [IST]
Other articles published on Jul 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X