న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్‌లా భయం లేకుండా మయాంక్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు: లక్ష్మణ్‌

IND vs SA: VVS Laxman compares Mayank Agarwals fearless batting of Virender Sehwag

న్యూఢిల్లీ: విశాఖ టెస్టులో డబుల్ సెంచరీ చేసిన టీమిండియా టెస్ట్ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌పై మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌ సింగ్‌ ప్రశంసలు కురిపించారు. ఎలాంటి భయం లేకుండా మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌లా మయాంక్‌ ఆడుతున్నాడని లక్ష్మణ్‌ పేర్కొన్నాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా ఆడటానికి అతని మానసిక బలమే కారణమన్నాడు. 'మయాంక్‌ ఫుట్‌వర్క్‌ చక్కగా ఉంది. దీనివల్లే సరైన షాట్లు ఆడుతున్నాడని' హర్భజన్‌ అన్నాడు.

సెహ్వాగ్‌లా మయాంక్‌:

సెహ్వాగ్‌లా మయాంక్‌:

ఓ కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్‌ మాట్లాడుతూ... 'సాధారణంగా దేశవాళీ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు ఆటగాళ్లు కొద్దిగా మార్పులు చేసుకొని ఆడుతారు. కానీ.. మయాంక్‌ ఎలాంటి మార్పు లేకుండా ధైర్యంగా అలానే ఆడాడు. మానసిక స్థెర్యం, స్థిరత్వం అతడి బలాలు. అతని ఆరాధ్య క్రికెటరైన సెహ్వాగ్‌లానే మయాంక్‌ ఆడుతున్నాడు. మానసికంగా ఎంతో ధృడంగా ఉన్న కారణంగానే సునాయాసంగా షాట్లు కొడుతున్నాడు. అతను మెరుగైన క్రికెటర్‌' అని అన్నాడు.

ఫుట్‌వర్క్‌ చాలా బాగుంది

ఫుట్‌వర్క్‌ చాలా బాగుంది

హర్భజన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. 'మయాంక్‌కు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అతను ఆట తీరు చాలా మెరుగ్గా ఉంది. మయాంక్‌ ఫుట్‌వర్క్‌ బాగుంది. రివర్స్‌ స్వీప్‌ షాట్లు అతనిలోని ప్రతిభను చాటుతున్నాయి. అతడిలో చాలా ప్రతిభ దాగుంది. జట్టు కోసం ఏం చేయాలో మయాంక్‌కు బాగా తెలుసు. అందుకే బాగా రాణిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుకుని అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేవారు ఎక్కువగా నేర్చుకుంటున్నారు. వారు జాతీయ జట్టులో రావడానికి ఆలస్యం అవుతుంది.. కానీ మంచి నైపుణ్యాన్ని మాత్రం సాధిస్తున్నారు. మయాంక్‌ ఇలానే కష్టపడి జట్టులోకి వచ్చాడు' అని తెలిపాడు.

భారత్ ఘన విజయం

భారత్ ఘన విజయం

మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా విశాఖలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు తోడు బౌలర్ల కృషి తోడవ్వడంతో అచ్చొచ్చిన వైజాగ్‌ పిచ్‌పై భారత్‌ రెండో టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి రోజు పేసర్ మొహమ్మద్ షమీ (5/35), రవీంద్ర జడేజా (4/87) రాణించడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌ 203 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని 3 టెస్టుల ఫ్రీడమ్‌ సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.

Story first published: Tuesday, October 8, 2019, 13:16 [IST]
Other articles published on Oct 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X