న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: కొంచెం బుర్ర వాడి బంతులేయి.. బౌలర్‌పై రోహిత్ అసహనం (వీడియో)

IND vs SA 2019 : Rohit Sharma Angry With Navdeep Saini Advises Him To Use His Brain !
IND vs SA: Rohit Sharma fire on Navdeep Saini, To ask Use His Brain

బెంగళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటాడో అందరికి తెలిసిన విషయమే. కీలక సమయంలో బౌలర్ ధారాళంగా పరుగులు ఇచ్చినా.. ఫీల్డర్ క్యాచ్ మిస్ చేసినా కూల్‌గా ఉంటాడు. అవసరమయితే ధోనీ ఆటగాళ్ల దగ్గరకు వెళ్లి సూచనలు ఇస్తుంటాడు. ప్రస్తుత జట్టులో ధోనీ తర్వాత అంతే కూల్‌గా ఉండే ఆటగాడు వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ.

IND vs SA: టెస్టుల్లో పంత్ బెస్ట్‌ చాయిస్‌ కాదు.. అతనికంటే కంటే సాహానే అత్యుత్తమం!!

గతంలో ఎన్నడూ చూడలేదు:

గతంలో ఎన్నడూ చూడలేదు:

రోహిత్ శర్మ మైదానంలో కోపం ప్రదర్శించడం, అసహనానికి గురవడం చూడలేదు. ఇక ఐపీఎల్ ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నపుడు కూడా రోహిత్‌ శర్మలో కోపం చూడలేదు. ఎప్పుడూ కూల్‌గా ఉండే రోహిత్.. ఇటీవల దక్షిణాఫ్రికాతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో తీవ్ర అసహనానికి గురయ్యాడు. అంతేకాదు బౌలర్‌పై తన కోపాన్ని సైగలతో చూపించాడు.

బుర్ర వాడి బంతులేయి:

135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్‌ క్వింటన్‌ డీ కాక్‌, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బావుమా భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగారు. 12వ ఓవర్‌ వేస్తున్న పేసర్ నవదీప్‌ సైనీ వరుసగా బౌండరీలు ఇచ్చాడు. సైనీ బంతుల్ని లెగ్ సైడ్ బావుమా సునాయాసంగా బౌండరీకి తరలించాడు. దీంతో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్.. సైనీపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. కొంచెం బుర్ర వాడి బంతులేయమని సైగలతో హెచ్చరించాడు.

రోహిత్ భాయ్ కూల్:

రోహిత్ భాయ్ కూల్:

ప్రస్తుతం రోహిత్‌ శర్మ, నవదీప్‌ సైనీకి సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని లిటన్ దాస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసాడు. ఈ వీడియోపై అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు. 'రోహిత్ భాయ్ కూల్' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'రోహిత్ ఆన్ ఫైర్' అని మరో నెటిజన్ ట్వీట్ చేసాడు.

విశాఖలో మొదటి టెస్ట్:

విశాఖలో మొదటి టెస్ట్:

టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 134 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (36) టాప్ స్కోరర్. ఛేదనలో దక్షిణాఫ్రికా 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. డీ కాక్‌ అర్ధ సెంచరీ 79 (52 బంతుల్లో; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసాడు. ఈ విజయంతో సిరీస్‌ 1-1తో సమం అయింది. అక్టోబర్ 2 నుండి విశాఖ వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.

Story first published: Thursday, September 26, 2019, 14:01 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X