న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SA: తొలి టెస్ట్ కోసం టీమిండియా తుది జట్టు ఇదే?.. పంత్‌కు చోటు కష్టమే!!

IND vs SA 2019, 1st Test : India Probable XI For The Visakhapatnam Test Match || Oneindia Telugu
IND vs SA, Ist Test: India Probable XI for the Visakhapatnam Test, Rishab Pant got onether chance?


వైజాగ్: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ అక్టోబర్ 2 నుండి విశాఖలో జరగనుంది. నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో బుధవారం నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం టీమిండియా ఆటగాళ్లు విడతల వారీగా విశాఖకు చేరుకుంటున్నారు. మరోవైపు సన్నాహక మ్యాచ్ కోసం గత వారమే దక్షిణాఫ్రికా జట్టు విశాఖకు చేరుకుంది. ఒకసారి టీమిండియా తుది జట్టును పరిశీలిస్తే.

నా పిల్లల మీద ఒట్టు.. నేను మ్యాచ్ ఫిక్సింగ్‌ చేయలేదు: టీమిండియా క్రికెటర్నా పిల్లల మీద ఒట్టు.. నేను మ్యాచ్ ఫిక్సింగ్‌ చేయలేదు: టీమిండియా క్రికెటర్

ఓపెనర్‌గా రోహిత్:

ఓపెనర్‌గా రోహిత్:

పరిమిత ఓవర్ల ఓపెనర్ 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో అందరి దృష్టి అతనిపైనే ఉంది. రాహుల్ స్థానంలో టెస్ట్ ఫార్మాట్‌లో స్థానం దక్కించుకున్న రోహిత్.. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంబించనున్నాడు. సన్నాహక మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ ఎలా రాణిస్తాడో చూడాలి. మూడో స్థానంలో పుజారా, నాలుగో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీలు వస్తారు.

ఫామ్‌లో రహానే, విహారి:

ఫామ్‌లో రహానే, విహారి:

ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ అంజిక్య రహానే, ఆరో స్థానంలో తెలుగు తేజం హనుమ విహారిలు రానున్నారు. ఈ ఇద్దరు విండీస్ పర్యటనలో సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆ పర్యటనకు ముందు వరకు విమర్శలు ఎదుర్కొన్న ఈ ఇద్దరు.. టెస్ట్ సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ ఇద్దరిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అద్భుత ప్రదర్శనతో రహానే, విహారిలు తన స్థానాలను పదిలం చేసుకున్నారు.

పంత్‌కు చోటు కష్టమే:

పంత్‌కు చోటు కష్టమే:

ఇక టీమిండియా అసలు సమస్య వికెట్‌ కీపర్‌. యువ వికెట్‌ కీపర్‌ 'బ్యాట్స్‌మన్‌' రిషభ్‌ పంత్‌కు ఈ సిరీస్‌లో చోటు దక్కే అవకాశాలు కనిపించడంలేదు. వరుసగా అవకాశాలు ఇచ్చినా పంత్ విఫలమవుతుండడంతో.. అతని స్థానంలో సీనియర్ సాహాను జట్టులోకి తీసుకురావాలని కెప్టెన్, కోచ్ భావిస్తున్నారు. సాహాకే అవకాశం దక్కనుందని సమాచారం. మరో అవకాశమివ్వాలనుకుంటే మాత్రం పంత్ తుది జట్టులో ఉంటాడు.

అశ్విన్‌కు చోటు:

అశ్విన్‌కు చోటు:

టెస్ట్ సిరీస్ స్వదేశంలో జరుగుతుంది కాబట్టి ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో భారత్ బరిలోకి దిగనుంది. విండీస్ పర్యటనకు దూరంగా ఉన్న స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి రానున్నాడు. రవీంద్ర జడేజాకు ఆల్‌రౌండర్‌ స్థానంలో చోటు ఖాయం. ఇషాంత్ శర్మకు జోడిగా మొహ్మద్ షమీ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. బుమ్రా స్థానంలో వచ్చిన ఉమేష్.. జట్టులోకి వచ్చే అవకాశాలు లేవు.

Story first published: Monday, September 30, 2019, 12:39 [IST]
Other articles published on Sep 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X