న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెండూల్కర్, సిద్ధూ ఘనతకు రోహిత్, రాహుల్ చెక్.. 23 ఏళ్ల రికార్డు గల్లంతు!

Ind vs Pak: Rohit Sharma and KL Rahul breaks Tendulkar-Navjot Sidhu record

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌ను భారత జట్టు ఘనంగా మొదలుపెట్టింది. ప్రపంచకప్‌లో ఓపెనర్లు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పనడం విశేషం. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత జట్టు భారీ స్కోరు దిశగా సాగిపోయేందుకు దోహదపడింది. మ్యాచ్ ఎలా సాగుతున్నదంటే..

23 ఏళ్ల క్రితం సచిన్, సిద్దూ

23 ఏళ్ల క్రితం సచిన్, సిద్దూ

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 23 ఏళ్ల క్రితం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధు నెలకొల్పిన రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని రోహిత్, రాహుల్ తుడిచిపెట్టారు. 1996లో సచిన్, సిద్దూ జోడి ఓపెనింగ్ వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రపంచ కప్‌లో పాక్‌పై ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.

రోహిత్, రాహుల్ జంట రికార్డు భాగస్వామ్యం

రోహిత్, రాహుల్ జంట రికార్డు భాగస్వామ్యం

తాజా మ్యాచ్‌లో రోహిత్, రాహుల్ జంట 100 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఆదివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో 16వ ఓవర్లో రోహిత్ ఆడిన ఓ బంతితో 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

రోహిత్ శర్మ, రాహుల్ హాఫ్ సెంచరీ

రోహిత్ శర్మ, రాహుల్ హాఫ్ సెంచరీ

పాక్‌ ఓపెనింగ్ బౌలింగ్‌ను భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లు రోహిత్, రాహుల్ ధాటిగా ఎదుర్కొన్నారు. రోహిత్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ క్రమంలో రోహిత్ బాదిన ఓ బంతిని 91 మీటర్ల దూరం వెళ్లిపడటంతో భారీ సిక్సర్‌గా మారింది. అలాగే రాహుల్ కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

భారత జట్టు భారీ స్కోరు

భారత జట్టు భారీ స్కోరు

తదుపరి సమాచారం అందేసరికి.. భారత్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్నది. 28 ఓవర్లలో 163 పరుగులు చేసింది. 78 బంతుల్లో 57 పరుగులు (4x3, 6x2) చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ 3 పరుగులతో ఆడుతున్నాడు. రోహిత్ శర్మ 71 బంతుల్లో 84 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

1
43665

{headtohead_cricket_3_5}

Story first published: Sunday, June 16, 2019, 17:02 [IST]
Other articles published on Jun 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X