న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్‌ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్(వీడియో)

IND vs NZ: Kuldeep Yadav Outwits Daryl Mitchell With Unplayable Delivery In 2nd T20I

లక్నో: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అనూహ్య పరిస్థితుల్లో మళ్లీ భారత జట్టులోకి వచ్చిన కుల్దీప్.. సంచలన బౌలింగ్‌తో భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. తన బౌలింగ్‌తో మళ్లీ పాత కుల్దీప్‌ను తలపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ కుల్దీప్ సత్తా చాటాడు.

స్పిన్‌కు అనుకూలిస్తున్న వికెట్‌పై తన బౌలింగ్‌తో న్యూజిలాండ్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అయితే ఈ మ్యాచ్‌లో కుల్దీప్ తీసిన వికెట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వికెట్‌ను చూసిన అభిమానులు, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం, దివంగత క్రికెటర్ షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సందర్బంగా 10వ ఓవర్‌ను కుల్దీప్ వేయగా.. చివరి బంతికి డారిల్ మిచెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతి అనూహ్యంగా టర్న్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను లేపేసింది. బంతి టర్న్ అయిన విధానాన్ని చూసి డారిల్ మిచెల్ బిత్తరపోయాడు. స్టన్నింగ్ డెలివరీ అనుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఈ వికెట్ షేన్ వార్న్ వేసిన బాల్ ఆఫ్ సెంచరీని తలపించడంతో అభిమానులు లెజండరీ క్రికెటర్‌ను గుర్తు చేసుకుంటున్నారు.

షేన్‌ వార్న్‌.. కుల్దీప్‌ రూపంలో ఇంకా బతికే ఉన్నాడంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. వార్న్‌ సైతం ఇలాంటి అద్భుతమైన బాల్స్‌ ఎన్నో వేసి.. బ్యాటర్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. కుల్దీప్‌ సైతం గతంలో ఇలాంటి సూపర్‌ డెలవర్సీతో బాబర్‌ అజమ్‌ను రెండు సార్లు అవుట్‌ చేశాడు.

కుల్దీప్‌ ఇలాంటి బాల్‌ వేస్తే.. ప్రపంచంలో ఎంత గొప్ప బ్యాటర్‌ అయినా సరే వికెట్‌ సమర్పించుకోవాల్సిందే అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కొనియాడుతున్నారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమవ్వగా.. ఫైనల్ మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.

Story first published: Monday, January 30, 2023, 21:51 [IST]
Other articles published on Jan 30, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X