న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Venkatesh Iyer: ఓపెనర్‌గా అతనే సమర్థుడు: టీమిండియా మాజీ ప్లేయర్

 IND vs IRE 2022 T20: Venkatesh Iyer could open for India, says WV Raman

ముంబై: జూనియర్లతో కూడిన భారత క్రికెట్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తోంది. ఆ దేశ జట్టుతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడబోతంది. తొలి మ్యాచ్ ఆరంభం అయ్యేది ఆదివారమే. భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. డబ్లిన్‌లోని మలహిడె స్టేడియం.. దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. 28వ తేదీన రెండో టీ20 మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఈ సిరీస్‌ అనంతరం ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్లాల్సిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రకటిస్తుంది.

టెస్ట్ తరువాత..

టెస్ట్ తరువాత..

ఈ పర్యటన కోసం ఎంపికైన క్రికెటర్లు ఐర్లాండ్ నుంచి ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్తారు. ఇప్పటికే అక్కడ పర్యటిస్తోన్న సీనియర్ల జట్టుతో కలుస్తారు. ఇంగ్లాండ్‌తో పెండింగ్‌లో ఉన్న ఓ టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం భారత జట్టు టీ20, వన్డే ఇంటర్నేషనల్స్ సిరీస్‌ ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌ల కోసం బీసీసీఐ జట్టును ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న సీనియర్ల జట్టు.. టెస్ట్ మ్యాచ్ కోసం ఉద్దేశించినదే.

ఐర్లాండ్ టు ఇంగ్లాండ్

ఐర్లాండ్ టు ఇంగ్లాండ్

ఐర్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన ప్లేయర్లకు ఇంగ్లాండ్ పర్యటనలో స్థానం దక్కుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. కాగా- ఈ యంగ్ ఇండియా జట్టుకు హార్దిక్ పాండ్యా కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు. సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కేప్టెన్. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, వెంకటేష్ అయ్యర్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్ ఐర్లాండ్‌ టూర్‌కు ఎంపికయ్యారు.

వెంకటేష్ అయ్యర్.. ఓపెనర్

వెంకటేష్ అయ్యర్.. ఓపెనర్

కాగా- వారిలో వెంకటేష్ అయ్యర్‌ను ఓపెనర్‌గా దించాలని టీమిండియా మాజీ ప్లేయర్ డబ్ల్యూవీ రామన్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ టోర్నమెంట్లల్లో కోల్‌కత నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్న అతను ఓపెనర్‌గా ఇప్పటికే తన సత్తా చాటుకున్నాడని గుర్తు చేశారు. వెంకటేష్ అయ్యర్ అద్భుతమైన ఆటగాడని, అతనికి అవకాశాలు రావట్లేదని చెప్పారు. ఏడాది కాలంగా పూర్తిస్థాయిలో తమ ప్రతిభను ప్రదర్శించుకోలేని ప్లేయర్లకు ఐర్లాండ్ టూర్ ఓ మంచి అవకాశమని అన్నారు.

లెఫ్ అండ్ రైట్ కాంబో..

లెఫ్ అండ్ రైట్ కాంబో..

వెంకటేష్ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కినప్పటికీ.. అతని స్థాయికి తగ్గట్టుగా అపార్చునిటీస్ రాలేదని వ్యాఖ్యానించారు. అతనిలోని పూర్తి స్థాయి ఆటగాడిని వెలికి తీయాలనుకుంటే మాత్రం ఓపెనర్‌గా పంపించాల్సి ఉంటుందని చెప్పారు. తన వరకు తాను ఓపెనర్‌గా వెంకటేష్ అయ్యర్ ఉంటేనే బాగుంటుందని అనుకుంటున్నట్లు డబ్ల్యూవీ రామన్ స్పష్టం చేశారు. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కావడం అతనికి కలిసొచ్చే అంశమని, లెఫ్ అండ్ రైట్ ఓపెనర్ల కాంబినేషన్ విఫలమైన సందర్భాలు చాలా తక్కువేనని అన్నారు.

Story first published: Saturday, June 25, 2022, 10:41 [IST]
Other articles published on Jun 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X