న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1-3తో భారత్ ఓటమి: అంతా సెలక్టర్ల తప్పిదమే, వెంగీ విమర్శ

By Nageshwara Rao
IND vs ENG: India made a huge mistake by not picking Rohit Sharma for last two Tests, says Dilip Vengsarkar

హైదరాబాద్: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి జట్టుని ఎంపిక చేసే సమయంలో రోహిత్ శర్మను పక్కనపెట్టి భారత సెలక్టర్లు పెద్ద తప్పిదం చేశారని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్ మురళీ విజయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో చివరి రెండు టెస్టుల కోసం పృధ్వీ షా‌‌కి అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పృధ్వీ షా‌‌కి కాకుండా.. రోహిత్ శర్మకి ఆ ఛాన్సి ఇచ్చి ఉంటే బాగుండేదని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. అనాలోచితంగా సెలక్టర్లు జట్టుని ఎంపిక చేసిన కారణంగానే నాలుగో టెస్టులో భారత్ జట్టు ఓడిందని తద్వారా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-3తో చేజార్చుకుందని వెంగ్ సర్కార్ చెప్పుకొచ్చారు.

1
42378

"టెస్టు సిరీస్‌ కోసం రోహిత్ శర్మని జట్టులోకి తీసుకోకుండా భారత సెలక్టర్లు పెద్ద తప్పిదం చేశారు. టెస్టుల్లో అతనికి మంచి రికార్డులు లేకపోవచ్చు. కానీ.. మ్యాచ్ పరిస్థితులకి అనుగుణంగా రోహిత్ శర్మ ఆడగలడు. అతడ్ని పక్కన పెట్టడం ద్వారా సెలక్టర్లు అనాలోచితంగా జట్టుని ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది" అని అన్నారు.

"ఇంగ్లాండ్ పిచ్‌లపై ఎవరు మెరుగ్గా రాణించగలరు? అని అంచనా వేయడంలో విఫలమయ్యారు. అలాగే ప్రత్యామ్నాయ ఆటగాళ్లపైనా దృష్టి సారించలేకపోయారు" అని వెంగ్‌సర్కార్ విమర్శించారు. ఇదిలా ఉంటే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైనా ఆఖరి టెస్టు ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

Story first published: Thursday, September 6, 2018, 8:12 [IST]
Other articles published on Sep 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X