న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: చెలిరేగిన పోప్, వోక్స్.. చేతులెత్తేసిన భారత బౌలర్లు.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్!

England take 99-run lead after Chris Woakes brisk 50

ఓవల్: బౌలింగ్‌లో చెలరేగిన ఇంగ్లండ్.. బ్యాటింగ్‌లోను అదే జోరును కనబర్చింది. భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఆతిథ్య జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 99 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది. ఓలి పోప్(159 బంతుల్లో6 ఫోర్లతో 81) బాధ్యతాయుత హాఫ్ సెంచరీకి క్రిస్ వోక్స్(58 బంతుల్లో11 ఫోర్లతో 50) ధనాధన్ ఇన్నింగ్స్ తోడవడంతో మ్యాచ్‌పై రూట్ సేన పట్టు బిగించింది. చెత్త బ్యాటింగ్‌తో చేతులెత్తేసిన కోహ్లీసేన.. బౌలింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చింది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా.. జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్, శార్దూల్‌కు చెరొక వికెట్ దక్కింది.

శుభారంభం అందించినా..

శుభారంభం అందించినా..

అంతకుముందు 53/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌ (31), ఒవర్టన్‌ (1 )వికెట్లను కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ఈ ఇద్దరు పెవిలియన్ చేరారు. ముందుగా నైట్ వాచ్‌మన్ ఓవర్టన్‌ను స్లిప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చిన ఉమేశ్ యాదవ్.. ఆ తర్వాత డెవిడ్ మలాన్‌ను కూడా స్లిప్ క్యాచ్‌గానే ఔట్ చేశాడు. దాంతో 62 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో, ఓలీపోప్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డు పరుగెత్తించారు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బెయిర్ స్టో వరుస బౌండరీలతో దూకుడు కనబర్చగా.. శార్దూల్, ఉమేశ్ బౌలింగ్‌లోనూ ఓలీ పోప్ ధాటిగా ఆడాడు. దాంతో ఇంగ్లండ్ 139/5 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

ఒలి పోప్ హాఫ్ సెంచరీ..

ఒలి పోప్ హాఫ్ సెంచరీ..

ఈ ఇద్దరి జోరుతో ఫస్ట్ సెషన్‌‌ను ఇరు జట్లు సమంగా పంచుకున్నాయి. ఇక లంచ్ బ్రేక్ తర్వాత సిరాజ్.. బెయిర్ స్టోను ఔట్ చేసి బ్రేక్ త్రూ అందించాడు. 89 పరుగుల బిగ్ పార్టనర్‌షిప్‌కు తెరదించాడు. ఆ తర్వాత మొయిన్ అలీ బ్యాటింగ్‌కు రాగా.. ఓలీ పోప్ 92 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొయిన్ అలీ(35)తో కలిసి ఏడో వికెట్‌కు కీలక 71 పరుగులు జత చేశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జడేజా అద్భుత బంతితో విడదీశాడు. మోయిన్ అలీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రిస్ వోక్స్ క్రీజులోకి రాగా ఓలీ పోప్ మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను 227/7తో ముగించాడు.

క్రిస్ వోక్స్ మెరుపులు..

క్రిస్ వోక్స్ మెరుపులు..

ఆ తర్వాత కొద్ది సేపటికే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఓలిపోప్‌ను శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే ఓలీ రాబిన్సన్‌(5)ను జడేజా బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనని అంతా భావించారు. కానీ క్రిస్ వోక్స్ కొరకరాని కొయ్యాలా మారి చివరి వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సింగిల్ తీసి స్టైకింగ్ తీసుకునే ప్రయత్నం చేసిన క్రిస్ వోక్స్ రనౌటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.

భారత్ 191 ఆలౌట్..

భారత్ 191 ఆలౌట్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దుల్‌ ఠాకూర్‌ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్‌ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్‌ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్‌పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్‌ (5)ను బౌల్డ్‌ చేశాడు. హమీద్‌ (0)ను కీపర్‌ పంత్‌ క్యాచ్‌తో పెవిలియన్‌ చేర్చాడు. ఉమేశ్‌ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్‌ రూట్‌ (21)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. కానీ ఈ శుభారంభాన్ని భారత్ బౌలర్లు కొనసాగించలేకేపోయారు. లోయరార్డర్, లోయర్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయలేక ఆతిథ్య జట్టుకు భారీ లీడ్ అందించారు.

Story first published: Friday, September 3, 2021, 22:11 [IST]
Other articles published on Sep 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X