న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Dinesh Karthik: అక్కడ సెటిల్ అయినట్టే: వారిద్దరి ఇక తెరమరుగేనా?

IND vs ENG 2021: Dinesh Karthik from India side Commentator for the test series

లండన్: భారత్-ఇంగ్లాండ్ మధ్య అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్..ప్రారంభం కావడానికి ముహూర్తం సమీపించింది. ఇంకో మూడు రోజుల్లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. 4వ తేదీన మధ్యాహ్నం 3:30 గంటలకు టాస్ పడుతుంది. నాటింగ్‌హామ్ ట్రెంట్‌బ్రిడ్జ్ స్టేడియం దీనికి వేదికగా మారింది. చివరి టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫర్డ్‌లో వచ్చేనెల 14వ తేదీన ముగుస్తుంది. టీమిండియా చేపట్టిన సుదీర్ఘమైన టూర్ ఇది. కిందటి నెల ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ చేరినప్పటి నుంచి కోహ్లీసేన ఇంగ్లాండ్‌లోనే ఉంటోంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం కామెంటేటర్‌ అవతారం ఎత్తాడు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తిక్. మైక్ పట్టుకుని కామెంటరీ బాక్స్‌లో కూర్చోవడం అదే తొలిసారి అతనికి. టీమిండియా టీ20 ఫార్మట్ బ్యాట్స్‌మెన్, కోల్‌కత నైట్ రైడర్స్ డాషింగ్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ కామెంటరీగా మంచి పేరు తెచ్చుకున్నాడు. స్పాంటేనియస్‌గా స్పందిస్తాడనే గుర్తింపును దక్కించుకున్నాడు. బ్యాట్ పట్టుకుని క్రీజ్‌లో కనిపించాల్సిన దినేష్ కార్తిక్.. దీనికి భిన్నంగా మైక్ పట్టుకుని కామెంటరీ బాక్స్‌లో కనిపించిన దినేష్ కార్తీక్ అక్కడా తన సత్తా చాటాడు.

ఇప్పటిదాకా కామెంటేటర్‌గా వ్యవహరించిన అనుభవం అతనికి లేదు. అయినప్పటికీ- తొలి రోజు నుంచే తన మార్క్‌ కామెంటరీతో ఆకట్టుకున్నాడు. ఏకంగా ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్ నాజిర్ హుస్సేన్‌ను టార్గెట్‌గా చేసుకున్నాడు అతణ్ని స్లెడ్జింగ్‌ కూడా చేశాడు. సాధారణంగా భారత్ తరఫున కామెంటేటర్లుగా లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్ కనిపిస్తుంటారు. ఈ సారి దినేష్ కార్తీక్ పేరు బాగా వినిపిస్తోంది. ఇంగ్లాండ్‌తో ప్రారంభం కాబోయే అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా దినేష్ కార్తీక్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతోన్నాడు. భారత్ నుంచి అతనొక్కడే కామెంటేటర్‌గా ఉంటాడని తెలుస్తోంది.

Dinesh Karthik reveals KKR owner Shah Rukh Khan once arranged a private jet for him

మాజీ టెస్ట్ దిగ్గజ ప్లేయర్లు మైక్ హోల్డింగ్, ఇయాన్ వర్డ్, ఆండ్రూ స్ట్రాస్, మైక్ అథర్టన్‌ కామెంటేటర్లుగా ఉంటారు. నాజిర్ హుస్సేన్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. తొలి టెస్ట్‌కు మాత్రం అతను అందుబాటులో ఉండట్లేదు. అలాగే- రాబ్ కీ, ఎబొని రెయిన్‌ఫోర్డ్-బ్రెంట్ కూడా అందుబాటులో ఉండడు. హండ్రెడ్ లీగ్స్ కొనసాగుతోన్నందున ప్రస్తుతం వారిద్దరూ ఆ మ్యాచ్‌లకు కామెంటర్లుగా ఉన్నారు. ఆ లీగ్ ముగిసిన వెంటనే ఈ సిరీస్‌లో జాయిన్ అవుతారు. అప్పటికి తొలి టెస్ట్ మ్యాచ్ ముగుస్తుంది.

Story first published: Sunday, August 1, 2021, 11:42 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X