న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ పులి.. మైదానంలో అలానే ఉండాలి'

Ind vs Aus: Kohli should not stop being aggressive, says former selector Sandeep Patil ahead of 3rd Test

ముంబై : కోహ్లీ తన దూకుడును తగ్గించుకోవాల్సిన అవసరం లేదని మాజీ క్రికెటర్‌ సందీప్ పాటిల్‌ అన్నారు. కోహ్లీపై చుట్టుముట్టిన వివాదంపై ఆయన మాట్లాడారు. ఆసీస్‌గడ్డపై కోహ్లీ పోరాటం సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు. దూకుడు లేని కోహ్లి కోరల్లేని పులితో సమానమని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ టీమ్‌ పైన్‌-కోహ్లి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో కోహ్లిని తప్పుబడుతూ.. ఆసీస్‌ మీడియా దుమ్మెత్తిపోసింది. ఈ నేపథ్యంలో కోహ్లికి మద్దతుగా ఈ మాజీ క్రికెటర్‌ నిలిచాడు. ఆసీస్‌గడ్డపై కోహ్లి పోరాటం సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

కోహ్లి కూడా మైదానంలో దూకుడుగానే

కోహ్లి కూడా మైదానంలో దూకుడుగానే

'పులి అడవిలోనే ఉండాలి. కానీ బోన్లో కాదు. అదే విధంగా కోహ్లి కూడా మైదానంలో దూకుడుగానే వ్యవహరించాలి. అది అతని స్వభావం. అదే మాత్రం తగ్గినా కోహ్లిలో ఉండే పవర్‌ తగ్గిపోతుంది. పులి బోన్లో ఉంటే దాని పవర్‌ను చూపించలేదు. కోహ్లి విషయంలో కూడా ఇంతే. దాని వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. రెండో టెస్టులో కోహ్లీ ఎలా ఉన్నాడో మూడో టెస్టులోనూ అదే కొనసాగించాలి.

దూకుడు తగ్గించుకోమనడం సరికాదు

దూకుడు తగ్గించుకోమనడం సరికాదు

ఒకవేళ కోహ్లి తన దూకుడుతో హద్దులు దాటితే అతని మ్యాచ్‌ ఫీజులో కోత విధించండి. అంతేకానీ ఆ దూకుడునే తగ్గించుకోమనడం సరికాదు. దీని ప్రభావం భారత్‌ విజయాల మీద పడుతుంది. పెర్త్‌ వేదికగా ఏం జరిగిందో నిజనిజాలు తెలుసుకోవాలి కానీ ఒకర్నే నిందించడం సబబు కాదు. ఒకప్పుడు ఆసీస్‌ ఆటగాళ్లు సైతం ఇలా ప్రవర్తించిన వాళ్లే. దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి' అని అన్నారు.

మాటల యుద్దం ఆటలో భాగమే

మాటల యుద్దం ఆటలో భాగమే

ఇక ఆసీస్‌ కెప్టెన్‌ టీమ్‌ పైన్‌ సైతం ఆ మాటల యుద్దం ఆటలో భాగమేనని, రెండు బలమైన జట్లు విజయం కోసం ఆరాటపడుతున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్న ఘటనలు చోటుచేసుకోవడం సహజమని చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లి దూకుడుగానే వ్యవహరించాలని వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ వివ్‌ రిచర్డ్స్‌, పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్‌ రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్‌ అక్తర్‌లు సైతం అభిప్రాయపడ్డారు. కానీ ఆసీస్‌ మీడియా మాత్రం పనిగట్టుకోని కోహ్లిపై నిందలు వేస్తూ.. మానసికంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది.

Story first published: Sunday, December 23, 2018, 12:06 [IST]
Other articles published on Dec 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X