న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భయానక బీమర్లు..బౌన్సర్లు: టీమిండియాకు ఇది ట్రైలర్ మాత్రమే: ఆసీస్ బౌలర్ డేంజరస్ స్పెల్

 IND vs AUS 2020: Mitchell Starc, Marnus Labuschagne Clash Ahead Of India Series

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా బౌలింగ్ తురుఫుముక్క మిఛెల్ స్టార్క్.. భారత క్రికెట్ జట్టు పర్యటనకు సన్నద్ధమౌతున్నాడు. తన బౌలింగ్ నైపుణ్యానికి మరింత పదును ఎక్కిస్తున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లపై విరుచుకుని పడుతున్నాడు. ఆస్ట్రేలియాలో ఆరంభమైన దేశవాలీ క్రికెట్ టోర్నమెంట్ షెఫ్పర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌ మ్యాచ్‌లో మిఛెల్ స్టార్క్ బౌలింగ్ వాడి ఎలా ఉంటుందనేది మరోసారి స్పష్టమైంది. అతని బౌలింగ్‌లో భయానక బౌన్సర్లు కనిపించాయి. ఒకట్రెండు బీమర్లు.. బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాయి.

పదునెక్కిన స్టార్క్ బౌలింగ్..

భారత క్రికెట్ జట్టు సుదీర్ఘమైన ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. టీ20, వన్డే ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచ్‌లను ఆడబోతోంది. దీనికోసం రెండు దేశాల క్రికెట్ బోర్డులు.. తమ జాతీయ జట్లను ఇదివరకే ప్రకటించాయి. టీమిండియాతో తలపడే ఆస్ట్రేలియా జట్టులో మిఛెల్ స్టార్క్‌ను తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. టీ20, వన్డే ఇంటర్నేషనల్ జట్లల్లో స్టార్క్ ఆడబోతున్నాడు. టెస్ట్ జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. సుదీర్ఘమైన విరామం అనంతరం గ్రౌండ్‌లోకి అడుగు పెట్టిన మిఛెల్ స్టార్క్.. తన బౌలింగ్ సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంటున్నాడు.

నో ఆన్సర్..

షెఫ్పర్డ్ షీల్డ్ టోర్నమెంట్‌‌లో భాగంగా క్వీన్స్‌లాండ్, న్యూ సౌత్ వేల్స్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడతను. న్యూ సౌత్‌వేల్స్ తరఫున ఆడుతోన్న అతను క్వీన్స్‌లాండ్ బ్యాట్స్‌మెన్‌ మార్ముస్ లంబుషేన్‌పై సంధించిన బౌన్సర్‌కు అతని వద్ద సమాధానమే లేకపోయింది. దాన్ని ఆడలేకపోయాడు లంబుషేన్. ఈ బంతిని బ్రూట్ ఎ బాల్ గా అభివర్ణించింది క్రికెట్ ఆస్ట్రేలియా. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

క్వీన్స్‌లాండ్ టీమ్ స్కోర్ ఒక వికెట్ నష్టానికి 62 పరుగులు చేసిన సమయంలో తొమ్మిదో ఓవర్‌ను వేశాడు స్టార్క్. ఓవర్ చివరి బంతిని 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌన్సర్‌గా సంధించాడు. ఊహించని దాని కంటే వేగంతో వచ్చిన ఆ బంతిని లంబుషేన్ ఆడలేకపోయాడు. కనీసం బ్యాట్‌ను కూడా అడ్డు పెట్టలేకపోయాడు. అతని భుజాలను రాసుకుంటూ గాల్లోకి లేచిందా బంతి. అంతకుముందు కూడా ఇదే మ్యాచ్‌లో డేంజరస్ బౌన్సర్లను విసిరాడు. అంతకుముందు- లంబుషేన్‌ను మన్కడిన్ చేయబోయి.. హెచ్చరించి వదిలేశాడు స్టార్క్.

టిపికల్ బౌలర్‌గా..

టిపికల్ బౌలర్‌గా..

టీమిండియాను ఢీ కొట్టబోయే ఆస్ట్రేలియా జట్టులో లంబుషేన్‌కు కూడా చోటు దక్కింది. తన బౌలింగ్ పదును ఎలా ఉంటుందనేది జస్ట్ ఓ ట్రైలర్‌లా చూపించాడని అనుకోవచ్చు. అసలు సినిమా.. ముందుందనే సంకేతాలను ఆయన భారత జట్టుకు పంపించినట్టయింది. కఠినమైన పిచ్‌లపై మరింత రెచ్చిపోతుంటాడు స్టార్క్. టిపికల్ బౌలర్‌గా అతనికి పేరుంది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు అతణ్ని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తి రేపుతోంది.

Story first published: Friday, October 30, 2020, 14:17 [IST]
Other articles published on Oct 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X