న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్ కన్నా ఏడు రెట్లు పెద్దదైన భారత్‌ను క్రికెట్లో తరచుగా ఓడించేవాళ్లం: ఇమ్రాన్‌ ఖాన్‌

Imran Khan says We used to quash 7-times bigger India in Cricket


దావోస్‌:
పాకిస్తాన్‌ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. పరిమాణంలో పాకిస్తాన్‌ కన్నా ఏడు రెట్లు పెద్దదైన భారత్‌ను క్రికెట్లో తరచుగా ఓడించేవాళ్లం అని అన్నారు. దావోస్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఇమ్రాన్‌ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను క్రికెట్‌ ఆడే సమయంలో ఎన్నోసార్లు భారత్‌ను ఓడించామన్నారు. అప్పట్లో హాకీ, ఇతర క్రీడలలో కూడా పాక్‌ ఆధిపత్యం చెలాయించింది అని ఆయన పేర్కొన్నారు. అయితే టీమిండియా చేతిలో చవిచూసిన ఘోర పరాజయాలను మాత్రం చెప్పలేదు.

సిరీస్‌-సిరీస్‌కు మధ్య తక్కువ సమయమే ఉన్నా ఆడడానికి సిద్ధం: కోహ్లీసిరీస్‌-సిరీస్‌కు మధ్య తక్కువ సమయమే ఉన్నా ఆడడానికి సిద్ధం: కోహ్లీ

అదే ఆశతో పెరిగాను:

అదే ఆశతో పెరిగాను:

ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ... '1960లో పాకిస్తాన్‌ చాలా అద్భుత దేశం. ఆసియా దేశాలకు ఆదర్శంగా నిలిచేది. నేను అదే ఆశతో పెరిగాను. కానీ.. దురదృష్టవశాత్తు దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. ప్రజాస్వామ్యం గతి తప్పడంతో.. సైన్యం రంగప్రవేశం చేసింది. పాకిస్థాన్‌ పితామహులు తెలివిగా పనిచేశారు. మానవత్వం, సామాజిక న్యాయం కోరుకున్నారు. కానీ.. అది పక్కదారి పట్టింది. దేశంలో మంచి పరిపాలన అందించగలిగితే పాకిస్తాన్‌ అభివృద్ధి చెందడం ఖాయం' అని అభిప్రాయపడ్డారు.

భారత్‌ను తరచుగా ఓడించేవాళ్లం:

భారత్‌ను తరచుగా ఓడించేవాళ్లం:

'భారత్‌ పరిమాణంలో పాకిస్తాన్‌ కన్నా ఏడు రెట్లు పెద్దది. కానీ.. నేను క్రికెట్‌ ఆడుతున్న రోజుల్లో భారత్‌ను తరచుగా ఓడించేవాళ్లం. హాకీ, ఇతర క్రీడలలో కూడా పాక్‌ ఆధిపత్యం చెలాయించింది. క్రికెట్‌ నుంచి ఎంతో నేర్చుకున్నా. క్రీడల్లో రెండో స్థానంలో నిలిస్తే మర్యాద ఉండదని తెలుసుకున్నా. అప్పట్లో ఓడిన జట్టుకు ఏ బహుమతి ఇచ్చేవారు కాదు. కనీసం సానుభూతి కూడా చూపేవారు కాదు' అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

 రాజకీయాల్లోకి రాగానే నవ్వారు:

రాజకీయాల్లోకి రాగానే నవ్వారు:

'నేను రాజకీయాల్లోకి రాగానే కొందరు నవ్వారు. కానీ.. ఎప్పుడూ కూడా లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. దేశంలో అనేక సహజ వనరులున్నాయి. సులభతర వాణిజ్య సూచీలో మెరుగైన స్థానాన్ని పొందడమే మా లక్ష్యం' అని ఇమ్రాన్‌ చెప్పుకొచ్చారు. క్యాన్సర్‌తో చనిపోయిన తన తల్లి పేరుతో 'క్యాన్సర్‌ ఆస్పత్రి'ని కట్టించి నష్టం వచ్చినా 70 శాతం ఉచిత వైద్యం ఎలా అందిస్తున్నా అని అన్నారు. మీడియా నన్ను లక్ష్యంగా చేసుకొని ప్రతికూల వార్తలతో గురిపెడుతుంది. అందుకే ఉదయం పూట వార్తా పత్రికలను చదవడం, టీవీ చాట్‌ షోలు చూడటమే మానేశా అని తెలిపారు.

Story first published: Friday, January 24, 2020, 11:18 [IST]
Other articles published on Jan 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X