న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బాల్ రివర్స్ స్వింగ్ ఎవరైనా చేయొచ్చు'

What Is Reverse Ball Swing??
IIT Kanpur invents physics formula for deadly reverse swing in cricket

హైదరాబాద్: ఎలాంటి బంతినైనా ఎదుర్కొనే బ్యాట్స్‌మెన్లను తికమక పెట్టేందుకు ఫాస్ట్‌ బౌలర్లకు ఏకైక అస్త్రం స్వింగ్‌. నేరుగా దూసుకొచ్చే బంతులను ఎంతో సులువుగా బౌండరీలకు తరలించే బ్యాట్స్‌మెన్లు స్వింగ్‌ విషయానికొస్తే.. ఆ బంతిని నిలువరించడానికే అష్టకష్టాలు పడతారు. ఇలాంటి స్వింగ్‌ బంతులను విసరాలని అందరూ అనుకుంటారు. మరి స్వింగ్‌ అంటే ఏమిటి.? ఫాస్ట్‌బౌలర్లు అందరూ ‌స్వింగ్‌ చేయొచ్చా.?

రివర్స్‌ స్వింగ్‌ ఎలా ఏర్పడుతుంది...:

రివర్స్‌ స్వింగ్‌ ఎలా ఏర్పడుతుంది...:

ఈ సందేహాలకు కాన్పూర్‌ ఐఐటీ సమాధానమిస్తోంది. ఇదేం పెద్ద విషయం కాదంటూ తేల్చేసింది. క్రికెట్‌కీ కాన్పూర్‌ ఐఐటీకీ మధ్య సంబంధం ఎలా మొదలైందంటే.. కాన్పూర్‌ ఐఐటీలో అంతరిక్ష విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ సంజయ్‌ మిట్టల్‌, విద్యార్థులు రవి శక్య, రాహుల్‌ దేశ్‌పాండే రివర్స్ స్వింగ్‌ను ఎలా అర్థం చేసుకోవాలి, అసలు రివర్స్‌ స్వింగ్‌ ఎలా ఏర్పడుతుంది... అనే విషయంపై పరిశోధనలు చేసి కొన్ని విశ్లేషణలను మనముందుంచారు.

బౌలర్లు తీసుకునే రనప్‌, యాక్షన్‌, టెక్నిక్‌, విసిరే విధానం:

బౌలర్లు తీసుకునే రనప్‌, యాక్షన్‌, టెక్నిక్‌, విసిరే విధానం:

‌స్వింగ్‌ అనేది బౌలర్లు తీసుకునే రనప్‌, బౌలింగ్‌ యాక్షన్‌, టెక్నిక్‌, విసిరే విధానం, వాతావరణం, పిచ్‌ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో తేలింది. బంతి వేగం, చేతికోణం మధ్య ఉండే సంబంధంపై బంతి స్వింగ్‌ ఆధారపడి ఉంటుందని ప్రొ.మిట్టల్‌ తెలిపారు. పేస్‌ బౌలర్లంతా బంతిని విసిరే సమయంలో తమ బౌలింగ్‌ యాక్షన్‌లో కొన్ని మార్పులు చేసుకొని భౌతిక సూత్రాలను పాటిస్తే స్వింగ్‌ సాధ్యమవుతుంది.

గంటకు 119 నుంచి 125కి.మీ. వేగంతో బౌలింగ్‌

గంటకు 119 నుంచి 125కి.మీ. వేగంతో బౌలింగ్‌

గంటకు 119 నుంచి 125కి.మీ. వేగంతో బౌలింగ్‌ వేసే బౌలర్లు 20డిగ్రీల కోణంతో చేతిని వంచి బంతిని విసిరితే స్వింగ్‌ రాబట్టొచ్చు. బంతికి ఉండే గరుకుతనం నుంచి మరింత స్వింగ్‌ పొందడం వీలవుతుంది. గంటకు 79 నుంచి 140కి.మీలు... అంతకంటే ఎక్కువ వేగంతో బంతులను విసిరే బౌలర్లు ఈ స్వింగ్‌ సూత్రాన్ని పాటిస్తే రివర్స్‌స్వింగ్‌ను సాధించొచ్చని ఈ పరిశోధన ద్వారా తేలింది. గరుకుతనం వల్ల స్వింగ్‌ సాధ్యమైనప్పుడు బౌలర్లు బంతిని గరుకుగా మార్చే ప్రయత్నం చేస్తారు. మరి అది బాల్‌ టాంపరింగ్‌ కిందకు రాదా అన్న అనుమానం రావొచ్చు.

బీసీసీఐని కోరనున్న కాన్పూర్‌ ఐఐటీ:

బీసీసీఐని కోరనున్న కాన్పూర్‌ ఐఐటీ:

బంతిని గరుకుగా చేసే వెసులుబాటును కొన్ని పరిమితుల మేరకు ఆటగాళ్లకు ఐసీసీ కల్పించింది. కానీ మిల్లీమీటర్‌, అంతకంటే ఎక్కువగా బంతిని అరగ్గొట్టినట్లయితే అది బాల్‌ టాంపరింగ్‌ కిందకు వస్తుంది. వాతావరణం పొడిగా ఉన్నప్పటి కంటే తడిగా ఉన్నప్పుడూ, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడూ స్వింగ్‌ ఎక్కువగా నమోదవుతుంది. మరింతమంది యువ బౌలర్లకు స్వింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు వీలుగా కొంతమంది పేస్‌బౌలర్లతో ఈ సూత్రాన్ని ప్రయోగించి ఓసారి పరిశీలించాలని బీసీసీఐని కాన్పూర్‌ ఐఐటీ కోరనుంది.

Story first published: Tuesday, July 17, 2018, 16:26 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X