న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ నమ్మకాన్ని ఓ ప్లేయర్ పొగొట్టుకుంటే.. ఇక దేవుడు కూడా సాయం చేయలేడు'

If MS Dhoni believes a player doesn’t have it, even god cannot help him says S Badrinath

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీ నమ్మకాన్ని ప్లేయర్ ఒకసారి పొగొట్టుకుంటే.. ఇక అతనికి ఆ దేవుడు కూడా సాయం చేయలేడు అని భారత మాజీ ఆటగాడు సుబ్రమణియమ్‌ బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బద్రినాథ్ ప్రాతినిథ్యం వహించాడు. 2010, 2011లో చెన్నై టైటిల్ విజేతగా నిలవడంతో బద్రినాథ్ తనవంతు పాత్ర పోషించాడు. ఇక భారత జట్టులో కూడా మహీ కెప్టెన్సీలో కొన్ని మ్యాచ్‌లు ఆడాడు.

సునీల్‌ గవాస్కర్‌ గొప్ప మనసు.. పుట్టిన రోజున 35 మంది పిల్లల కోసం..!!సునీల్‌ గవాస్కర్‌ గొప్ప మనసు.. పుట్టిన రోజున 35 మంది పిల్లల కోసం..!!

నమ్మకాన్ని ఓ ప్లేయర్ పొగొట్టుకుంటే:

నమ్మకాన్ని ఓ ప్లేయర్ పొగొట్టుకుంటే:

హిందుస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బద్రీనాథ్ మాట్లాడుతూ...'జట్టులోని ప్రతి ఒక్కరి పాత్ర చాలా ముఖ్యమైనదని ధోనీ ఎప్పుడూ బావిస్తుంటాడు. అందుకే జట్టులోని ప్రతి ఆటగాడికి బాధ్యతలు అప్పగిస్తాడు. చాలా వరకూ నా బాధ్యత మిడిలార్డర్‌లో స్కోరు బోర్డుని ముందుకు నడిపించడం. మహీ అతిపెద్ద బలం ఏమిటంటే.. అతను ఆటగాళ్లకు అదనపు అవకాశం ఇస్తాడు. ధోనీ నమ్మాడంటే సరే. ఒకవేళ అతని నమ్మకాన్ని ఓ ప్లేయర్ కోల్పోతే.. ఇక ఆ దేవుడు కూడా సాయం చేయలేడు. ధోనీ ఒక మైండ్ సెట్‌తో ఉంటాడు. దానికే కట్టుబడి పని చేస్తాడు' అని తెలిపాడు.

మీరు ఛాంపియన్ సైడ్:

మీరు ఛాంపియన్ సైడ్:

'చెన్నై జట్టు డౌన్ టు ఎర్త్ మాదిరి. జట్టు టైటిల్ గెలిచినా, కీలక మ్యాచులు గెలుపొందినా.. ఆడంబరాలు, పార్టీలు ఒకే విధంగా ఉంటాయి. ఆటగాళ్లు ఎలా ఆడినా చెన్నై యజమానులు ఒకే విధంగా ఉంటారు. జట్టులో ఎల్లప్పుడూ అద్భుతమైన స్నేహశీలి మరియు మంచి జట్టు వాతావరణం ఉండేది. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ఉన్నారు కాబట్టి యాజమాన్యం ఎప్పుడూ 'మీరు ఛాంపియన్ సైడ్' ఉన్నారని మాకు తెలుసనేవారు. నేను ధోనీ నుండి నేర్చుకున్న ఒక విషయం ఏమిటంటే.. మ్యాచ్ సజావుగా సాగుతున్నప్పుడు దాన్ని దెబ్బతీయకుండా ఉంటాడు. అతడి ఏ నిర్ణయమైనా సరైనదిగా ఉంటుంది' అని బద్రీనాథ్ చెప్పాడు.

ఆ హాఫ్ సెంచరీ చాలా చిరస్మరణీయం:

ఆ హాఫ్ సెంచరీ చాలా చిరస్మరణీయం:

'నా మొదటి ఐపీఎల్ హాఫ్ సెంచరీ చాలా చిరస్మరణీయమైనది. నేను 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 64 పరుగులు బాదాను. అది నాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నేను టీ20 క్రికెటర్‌గా రాణించగలనని నమ్మకం వచ్చింది. ఆ ఇన్నింగ్స్ నా ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక పొట్టి ఫార్మాట్‌లో విజయం సాధించగలనని నాకు అర్ధమైంది. నా సన్నిహితుడు ఎల్ బాలాజీకి కూడా హ్యాట్రిక్ తీసాడు. ఆ మ్యాచ్ గెలిచాం. ఆ హాఫ్ సెంచరీ అభిప్రాయంలో భారీ మార్పు తెచ్చింది' అని బద్రినాథ్‌ పేర్కొన్నాడు.

మహీ ఐపీఎల్ ఆడతాడు:

మహీ ఐపీఎల్ ఆడతాడు:

'రిటైర్మెంట్ విషయం ఎంఎస్ ధోనీ సొంత నిర్ణయం. కాకపోతే మునుపటిలా అతని శరీరం సహకరించపోవచ్చు. మహీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ లేదా టెస్ట్ క్రికెట్ ఆడకపోవడానికి ఒక కారణం ఉంది. వెన్నుగాయం అతనిని ఇబ్బంది పెట్టింది. ఏ కీపర్‌కైనా ఇది సహజం. ధోనీ క్యాలిబర్ ఆటగాడు. అతను టీ20 ప్రపంచకప్ ఆడాలా వద్దా అని ఎవరూ నిర్ణయించకూడదు. ఐపీఎల్ ఆడతాడు. ప్రస్తుతం మహీ వీడ్కోలుపై చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అవి చాలావరకు నిజం కాదు' అని మాజీ ఆటగాడు చెప్పుకొచ్చాడు. ధోనీ కెప్టెన్సీలోని చెన్నై జట్టులో కొన్ని సీజన్లు ఆడిన బద్రీనాథ్.. ఆ తర్వాత కనుమరుగైపోయాడు.

2018లో క్రికెట్‌కు వీడ్కోలు:

2018లో క్రికెట్‌కు వీడ్కోలు:

సుబ్రమణియమ్‌ బద్రీనాథ్‌ 2018లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తమిళనాడుకు చెందిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ టీమిండియా తరుపున 2008 నుంచి 2011 మధ్య కాలంలో రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. రంజీ క్రికెట్‌లో తమిళనాడుకు 14 ఏళ్ల పాటు మిస్టర్ డిపెండబుల్‌గా బద్రినాథ్ సేవలందించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో 145 మ్యాచ్‌లాడిన బద్రినాథ్‌ 54.49 సగటుతో 10,245 పరుగులు చేశాడు. దాంట్లో 32 సెంచరీలు ఉన్నాయి.

Story first published: Saturday, July 11, 2020, 15:22 [IST]
Other articles published on Jul 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X