న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌లో టీమిండియానే ఫేవరెట్‌: అజహరుద్దీన్‌

ICC WorldCup 2019: Mohammad Azharuddin Picks His Favourite Sides To Win The World Cup

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019లో టీమిండియానే ఫేవరెట్‌. ఇది చాలా మంది మాజీ క్రికెటర్లు అంటున్న మాట. ఇప్పటికే భారత మాజీలు సచిన్, గవాస్కర్, అమర్నాథ్, గుంగూలీ, రవిశాస్త్రిలు భారత్‌కు కప్ గెలిచే సత్తా ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా చేరారు. ప్రపంచకప్‌ గెలిచే సత్తా కోహ్లీ సేనకు ఉందని అజహరుద్దీన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే మంచి అవకాశం:

ఇదే మంచి అవకాశం:

తాజాగా అజహరుద్దీన్‌ మాట్లాడుతూ... 'టీమిండియాకు ఇదే మంచి అవకాశం. మనకు మంచి జట్టుంది. ప్రపంచలోనే అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ పిచ్‌లు బౌలర్లకు అనుకూలిస్తే మనకు ఇబ్బంది కలుగుతుందని చాలామంది అంటున్నారు. మన బౌలర్లకు కూడా ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయగల సత్తా ఉంది. పేస్, స్పిన్ విభాగంలో అత్యుత్తమ బౌలర్లు ఉన్నారు' అని అజహరుద్దీన్‌ అన్నారు.

మిండియానే ఫేవరెటే:

మిండియానే ఫేవరెటే:

'ప్రస్తుత జట్టు మంచి సమతూకంగా ఉంది. ఈ జట్టుతో ప్రపంచకప్‌ గెలవకపోతే నిరాశపడతాను. ప్రపంచకప్‌లో కచ్చితంగా టీమిండియానే ఫేవరెటే. తొలి ప్రాధాన్యం టీమిండియాకే ఇస్తాను. టీమిండియా తర్వాత రెండు, మూడు స్థానాలను ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియాకు ఇస్తా. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేం' అని అజహరుద్దీన్‌ పేర్కొన్నారు.

మన జట్టుకు అలాంటివి రాకూడదు:

మన జట్టుకు అలాంటివి రాకూడదు:

'తమదైన రోజున మైదానంలో ఏ జట్టు బాగా ఆడుతుందో అదే విజయాన్ని అందుకుంటుంది. ప్రతి జట్టుకు కొన్ని ఓటములూ ఎదురవుతాయి. అయితే మన జట్టుకు అలాంటివి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగానే టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెపుతున్నా. ప్రతి ఆటగాడు బాగా రాణించాలని ఆశిస్తున్నా' అని అజహరుద్దీన్‌ తెలిపారు.

Story first published: Wednesday, May 15, 2019, 8:43 [IST]
Other articles published on May 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X