న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా No.4కు పరిష్కారం చూపించిన మైకేల్ క్లార్క్

ICC World Cup 2019: Rishabh Pant at No. 4 bodes well for Indian middle-order, opines Michael Clarke

హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించడం పట్ల ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ముగ్ధుడయ్యాడు. రిషబ్ పంత్‌ను నాలుగో స్థానంలో ఆడించడమే ఈ సమస్యకు సరైన పరిష్కారమని క్లార్క్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

గత ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ప్రపంచకప్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో 32 పరుగులు చేసి ఫరవాలేదనిపించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 పరుగులు చేసి తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

క్లార్క్ మాట్లాడుతూ

క్లార్క్ మాట్లాడుతూ

తాజాగా క్లార్క్ మాట్లాడుతూ "No. 4 స్థానంలో రిషబ్ పంత్‌ను ఆడించడం టీమిండియాకు పవర్ ఆప్షన్. అతను చెత్తగా ఆడితే స్ట్రైక్ రేట్ 100. అదే అతడు దూకుడుగా ఆడితే స్ట్రైక్ రేట్ 140 నుంచి 150 వరకు ఉంటుంది. మంచి పిచ్‌లపై ఇది టీమిండియాకు లాభిస్తుంది" అని అన్నాడు.

No. 6లో దినేశ్ కార్తీక్‌ను ఆడించాలి

No. 6లో దినేశ్ కార్తీక్‌ను ఆడించాలి

ఇక, No. 6లో దినేశ్ కార్తీక్‌ను ఆడించడం సరైన నిర్ణయమని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. హార్ధిక్ పాండ్యాతో పోలిస్తే దినేశ్ కార్తీక్ అయితే ఈ స్థానానికి చక్కగా సరిపోతాడని క్లార్క్ అన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చోటు దక్కించుకోవడంతో సుమారు 12 ఏళ్ల తర్వాత దినేశ్ కార్తీక్ తన వరల్డ్‌కప్ మ్యాచ్‌ని ఆడాడు.

దినేశ్ కార్తీక్ మరొక పాండ్యా

దినేశ్ కార్తీక్ మరొక పాండ్యా

"No. 6 స్థానంలో దినేశ్ కార్తీక్ అనుభవం పనికొస్తుంది. అతడు మరొక హార్దిక్ పాండ్యా. తొలి బంతి నుంచే ఫోర్లు బాదగలడు. మిడిలార్డర్‌లో దినేశ్ కార్తీక్ ఆడేందుకు అదే సరైన స్థానం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే, ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ సెంచరీ బాకీ ఉన్నాడు. ప్రస్తుతం టాప్-7 అద్భుతంగా ఉంది" అని క్లార్క్ అన్నాడు.

విజయ్ శంకర్ స్ధానంలో జట్టులోకి రిషబ్ పంత్

విజయ్ శంకర్ స్ధానంలో జట్టులోకి రిషబ్ పంత్

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా ఈ ప్రపంచకప్‌కు దూరం కావడంతో స్టాండ్ బై ఆటగాడు రిషబ్ పంత్‌ను ఇంగ్లాండ్‌కు పిలిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విజయ్ శంకర్ కూడా గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించడంతో తుది జట్టులో రిషబ్ పంత్ చోటు దక్కించుకున్నాడు.

Story first published: Thursday, July 4, 2019, 16:34 [IST]
Other articles published on Jul 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X