న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని ఔట్ చేసేది నేనే: ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు అలీ

ICC World Cup 2019: Moeen Ali sets sight on prized wicket of Virat Kohli in IND vs ENG clash

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని త్వరగానే ఔట్‌ చేస్తానని ఇంగ్లాండ్ బౌలర్ మొయిన్‌ అలీ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం బర్మింగ్ హామ్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మొయిన్ అలీ ఓ ఇంగ్లీషు ఛానెల్‌కి ఇంటర్యూ ఇచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

"టీమిండియాకు పరుగులు తీసేందుకే కోహ్లీ ఉన్నాడు. అతను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో మనకు తెలుసు. అతడిని ఔట్‌ చేసేందుకు నేనున్నా. అలాంటి గొప్ప ఆటగాడిని ఔట్‌ చేయడం అంత సులువైన విషయం కాదు. అయినా మేమిద్దరం స్నేహితులమే" అని మొయిన్ అలీ తెలిపాడు.

స్వదేశంలో వరల్డ్‌కప్‌ జరుగుతున్న సందర్భంలో ఆతిథ‍్య జట్టుపై ఒత్తిడి ఉంటుందన్నదనే విషయాన్ని తాను అంగీకరించడం లేదని అన్నాడు. "చిన్నప్పటి నుంచీ నా మిత్రులు, బంధువులతో కలిసి క్రికెట్‌ ఆడుతూనే పెరిగాను. ఇక్కడ గౌరవం ఇచ్చుపుచ్చుకోవడమే ముఖ్యం. స్వదేశంలో ఆడటం ఒత్తిడికి కారణంగా మారకూడదు" అని అన్నాడు.

"తదుపరి మ్యాచ్‌ భారత్‌తో ఆడబోతున్నాం. వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుపై ఉన్నంత ఒత్తిడి మాపై ఉండదు. మనం విజయం సాధించిన సందర్భంలో ప్రశంసలు.. అపజయాలు పాలైనప్పుడు విమర్శలు ఎవరికైనా సహజం" అని మొయిన్ అలీ అన్నాడు. కాగా, అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ ఆరుసార్లు మొయిన్‌ అలీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దీంతో ఆదివారం నాటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్‌ను సాధిస్తానంటూ మొయిన్‌ అలీ ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా రేపు జరగబోయే మ్యాచ్‌ రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీలో కోహ్లి ఇప్పటికే నాలుగు హాఫ్‌ సెంచరీలు సాధించి జోరు మీద ఉన్నాడు.

టోర్నలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. ఈ రెండు జట్లు టోర్నీలో అద్భుత విజయాలను నమోదు చేశాయి. టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా సెమీస్ దిశగా అడుగులు వేస్తుంటే, కివీస్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే ఓడింది.

మరోవైపు ఇంగ్లాండ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌ల్లో ఓడి తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఈ రెండు జట్లను ఎలా ఎదుర్కొంటుందోనన్నది ఆసక్తికరంగా మారింది. సొంత గడ్డపై తొలిసారి టైటిల్ గెలవాలన్న ఇంగ్లాండ్ కల ఈసారైనా నెరవేరుతుందో లేదో చూడాలి మరి.

ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లాడిన ఇంగ్లాండ్ జట్టు 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు బంగ్లాదేశ్, పాకిస్థాన్ కూడా చెరో ఏడు మ్యాచ్‌లు ఆడి, చెరో 7 పాయింట్లతో పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆడే రెండు మ్యాచ్‌లకు వరుణుడు అంతరాయం కలిగిస్తే ఇంగ్లాండ్ జట్టు పరిస్థితి అంతే మరి.

Story first published: Saturday, June 29, 2019, 18:54 [IST]
Other articles published on Jun 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X