న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: 'ఛాంపియన్' రబాడ అన్‌లక్కీ: సఫారీ కెప్టెన్

ICC Cricket World Cup 2019 : Rohit Got Two Lifes In This Match,Orelse We Won Says Duplesis!
ICC World Cup 2019: Champion Rabada was extremely unlucky: Du Plessis

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మకు రెండు సార్లు లైఫ్ లభించడమే తమ ఓటమికి కారణమైందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. సౌతాంప్టన్ వేదికగా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మ్యాచ్ అనంతరం సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ టీమిండియా బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాకు నాణ్యమైన బౌలర్లున్నారని, అయితే ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు సైతం అద్భుతంగా రాణించారని డుప్లెసిస్ తెలిపాడు. రోహిత్ శర్మకు రెండుసార్లు లైఫ్ లభించడం కూడా అతడి అదృష్టమని చెప్పుకొచ్చాడు.

బ్యాట్స్‌మెన్‌పై అటాకింగ్‌‌కు దిగేవాళ్లం

బ్యాట్స్‌మెన్‌పై అటాకింగ్‌‌కు దిగేవాళ్లం

డేల్‌ స్టెయిన్‌, లుంగి ఎంగిడి ఉండి ఉంటే ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌పై అటాకింగ్‌‌కు దిగేవాళ్లమని డుప్లెసిస్ తెలిపాడు. క్రిస్‌ మోరిస్‌ బంతితోపాటు బ్యాటింగ్‌తోనూ మెరిశాడని, తమ జట్టు ప్రతీసారి గెలవాలనే ఆడుతున్నా చిన్నపాటి తప్పిలదాల వల్లే ఓడిపోతున్నామని డుప్లెసిస్‌ ఈ సందర్భంగా వాపోయాడు.

9 వికెట్లకు 227 పరుగులు

9 వికెట్లకు 227 పరుగులు

ఈ మ్యాచ్‌లో చాహల్‌ (4/51), బుమ్రా (2/35), భువనేశ్వర్‌ (2/44) విజృంభణకు తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 227 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా నిర్ణీత 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ సెంచరీ

రోహిత్ శర్మ 144 బంతుల్లో 122(13 ఫోర్లు, 2 సిక్సులు) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. వన్డేల్లో రోహిత్‌కిది 23వ సెంచరీ. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది. టోర్నీలో భాగంగా టీమిండియా తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.

రబాడ వేసిన మొదటి ఓవర్లోనే

రబాడ వేసిన మొదటి ఓవర్లోనే

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన రోహిత్‌ శర్మ వాస్తవానికి రబాడ వేసిన మొదటి ఓవర్లోనే పెవలియిన్‌కు చేరాల్సింది. అప్పుడు రోహిత్ శర్మ ఒక పరుగుతో క్రీజులో ఉన్నాడు. మొదటి ఓవర్ నాలుగో బంతిని రోహిత్‌ శర్మ ఫుల్‌షాట్‌ ఆడబోగా అది గ్లోవ్స్‌కు తగిలి రెండో స్లిప్‌ దిశగా గాల్లోకి లేచింది.

క్లిష్టమైన క్యాచ్‌ను పట్టలేకపోయిన డుమిని

క్లిష్టమైన క్యాచ్‌ను పట్టలేకపోయిన డుమిని

ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న డుప్లెసిస్‌ దానిని క్యాచ్‌గా అందుకోలేకపోయాడు. ఆ తర్వాత తనకు అందించిన లైఫ్‌తో రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ జట్టులోని సహచర ఆటగాళ్లతో విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఆ తర్వాత మళ్లీ సరిగ్గా ఆరు బంతుల తర్వాత మోరిస్‌ ఓవర్లో డుమిని ఓ క్లిష్టమైన క్యాచ్‌ను పట్టలేకపోయాడు. ఈ రెండు సఫారీల ఓటమికి కారణమయ్యాయి.

Story first published: Thursday, June 6, 2019, 12:11 [IST]
Other articles published on Jun 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X