న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీ మరోసారి దంచి.. ఏడు వికెట్ల తేడాతో పాక్‌‌పై

ICC Womens World T20: Mithali Raj Powers India To Seven-Wicket Win Vs Pakistan

హైదరాబాద్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత అమ్మాయిలు అలవోకగా ఓడించారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది. న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో మెగా టోర్నీని ఆరంభించిన టీమ్‌ఇండియా.. పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది.

7 వికెట్ల తేడాతో పాక్‌పై హర్మన్‌ జట్టు

7 వికెట్ల తేడాతో పాక్‌పై హర్మన్‌ జట్టు

ఆదివారం (నవంబరు 11) జరిగిన గ్రూపు-బి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్ సేన 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో ఓవర్ మిగిలుండగానే 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. అనంతరం భారత్‌ 19 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్‌కు పది పరుగుల పెనాల్టీ పడటంతో లక్ష్యం మరింత చిన్నదిగా మారింది.

 మిథాలీ.. ఓపెనర్‌గా బరిలోకి

మిథాలీ.. ఓపెనర్‌గా బరిలోకి

గత మ్యాచ్‌లో మిడిలార్డర్లో ఉన్న మిథాలీ.. ఈ మ్యాచ్‌లో తిరిగి ఓపెనర్‌గా బరిలోకి దిగింది. వచ్చింది. ఆమెతో పాటు స్మృతి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సీనియర్‌ బ్యాట్స్‌ఉమెన్‌గా మిథాలీ రాజ్‌ (56; 47 బంతుల్లో 7ఫోర్లు) చక్కటి అర్ధశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. వీరిద్దరు తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(14), వేదా కృష్ణమూర్తి(8) నాటౌట్‌గా నిలిచారు.

మిథాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్

మిథాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్

దియాన బేగ్(1/19), నిదా దర్(1/17), బిస్మా మారూఫ్(1/21) ఒక్కో వికెట్ తీశారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో బుధవారం (నవంబరు 15) ఐర్లాండ్‌తో తలపడుతుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది. బిస్మా మరూఫ్‌ (53; 49 బంతుల్లో 4ఫోర్లు), నిదా దర్‌ (52; 35 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సులు) మినహా బ్యాటర్లు విఫలమయ్యారు. పూనమ్‌ యాదవ్‌ (2/24), హేమలత (2/34) పాక్‌ను కట్టడి చేశారు. స్మృతి మంధాన 26 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన మిథాలీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. భారత్‌ బుధవారం తన తర్వాతి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.

దిగకుండానే స్కోరు బోర్డుపై 10

దిగకుండానే స్కోరు బోర్డుపై 10

ఆదివారం నాటి భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌లో చిత్రం చోటు చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత అమ్మాయిలు బ్యాటింగ్‌కు దిగకముందే స్కోరు బోర్డుపై పది పరుగులు చేరాయి. పాకిస్థాన్‌ జట్టుకు పెనాల్టీ కింద భారత స్కోరులో అంపైర్లు ఈ పది పరుగులు కలిపారు. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ సందర్భంగా బిస్మా, నిదా పిచ్‌ మీద పదే పదే నడవడమే ఇందుక్కారణం.

Story first published: Monday, November 12, 2018, 10:37 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X