న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ టీ20: సెమీస్‌కు ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఆశలు సజీవం

ICC Womens World T20: Australia in semis; Pakistan notch up first win

హైదరాబాద్: కరేబియన్ దీవుల్లో జరుగుతున్న మహిళల వరల్డ్ టీ20లో ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌కు మరింత చేరువైంది. హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌కు దూసుకెళ్లింది. గ్రూప్ స్టేజిలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌ఉమెన్‌లో అలీసా హీలీ హాఫ్ సెంచరీతో రాణించగా, రేషల్ హేన్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్‌కు 154 భారీ పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

సెమీస్‌కు చేరిన ఆస్ట్రేలియా మహిళల జట్టు

సెమీస్‌కు చేరిన ఆస్ట్రేలియా మహిళల జట్టు

అనంతరం ఆసీస్ బౌలర్లు సమిష్టిగా చెలరేగడంతో న్యూజిలాండ్ జట్టు 17.3 ఓవర్లలో 120 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్‌పై ఆస్ట్రేలియా జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టుకు ఇది వరుసగా మూడో విజయం కావడం విశేషం. దీంతో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌కు అర్హత సాధించింది.

ఐర్లాండ్‌పై పాకిస్థాన్ విజయం

మరో మ్యాచ్‌లో భాగంగా ఐర్లాండ్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. సెమీఫైనల్ రేస్‌లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టును చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో కెప్టెన్ జవేరియా ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన జవేరియా ఖాన్ ఐర్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించి 52 బంతుల్లో 11 ఫోర్లతో 74 పరుగులు చేసింది.

101 పరుగులు చేసి ఆలౌటైన ఐర్లాండ్ జట్టు

అనంతరం 140 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ మహిళల జట్టు 101 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లలో సనా మిర్, ఆలియా రియాజ్, నష్రా సంధు, ఐమన్ అన్వర్ తలో రెండు వికెట్లు తీశారు. పాకిస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ జవేరియాకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాక్ ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేస్‌లో నిలిచింది.

న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న పాకిస్థాన్

న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనున్న పాకిస్థాన్

లీగ్ స్టేజి ఆఖరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే పాక్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టుపై విజయం సాధిస్తే సెమీస్‌కు వెళ్తుందా? లేదా అనేది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, November 14, 2018, 17:01 [IST]
Other articles published on Nov 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X