న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంకతో మ్యాచ్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బద్దలు కొట్టనున్న రికార్డులివే!

ICC WC 2019: Rohit Sharma, Virat Kohli on the verge of breaking big records


హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం టీమిండియా తన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరడంతో కోహ్లీసేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్లు పెరిగే అవకాశం ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

టీమిండియా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీలంక విషయానికి వస్తే ఆడిన 8 మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి మూడింట ఓడింది.

రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో 8 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కోసం కొన్ని రికార్డులు ఎదురు చూస్తున్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం...

సచిన్, గంగూలీల సరసన విరాట్ కోహ్లీ

సచిన్, గంగూలీల సరసన విరాట్ కోహ్లీ

శ్రీలంకతో జరగనున్న మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 5 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో 1000 పరుగులు చేసిన టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల సరసన నిలుస్తాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 44 ఇన్నింగ్స్‌ల్లో 2278 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా... సౌరవ్ గంగూలీ 21 ఇన్నింగ్స్‌ల్లో 1006 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఐదు హాఫ్ సెంచరీలు చేశాడు.

ప్రమాదంలో సచిన్, హెడెన్ రికార్డు

ప్రమాదంలో సచిన్, హెడెన్ రికార్డు

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఇప్పటికీ సచిన్ టెండూల్కర్(673 పరుగులు, 2003), మ్యాథ్యూ హెడెన్(659 పరుగులు, 2007) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ రికార్డు ప్రమాదంలో పడింది. అందుకు కారణంగా రోహిత్ శర్మ. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటికే 544 పరుగులు చేశాడు. శ్రీలంకతో జరిగే మ్యాచ్‌తో పాటు సెమీస్‌లో రోహిత్ శర్మ మరో మ్యాచ్ ఆడతాడు. ఈ నేపథ్యంలో సచిన్, హెడెన్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది,.

షకీబ్, టెండూలర్ రికార్డు సైతం

షకీబ్, టెండూలర్ రికార్డు సైతం

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ గ్రూప్ స్టేజిలో రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 544 పరుగులు చేశాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ 673 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్‌ 2007 ప్రపంచకప్‌లో 659 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత షకీబ్‌ (606) ఉన్నాడు. బంగ్లా టోర్నీ నుండి నిష్క్రమించడంతో సచిన్, హెడెన్‌ల రికార్డులకు షకీబ్‌ నుండి ఎలాంటి ప్రమాదం లేదు. అయితే, రోహిత్ శర్మ నుంచి షకీబ్‌కు ముప్పు ఉంది.

కుమార సంగక్కర రికార్డుకి ఎసరు

కుమార సంగక్కర రికార్డుకి ఎసరు

ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ(నాలుగు సెంచరీలు) ఇప్పటికే శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డుని సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లపై సెంచరీలు సాధించాడు. 2015 ప్రపంచకప్‌లో కుమార సంగక్కర సైతం నాలుగు సెంచరీలు సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ మరో సెంచరీ సాధిస్తే కుమార సంగక్కర రికార్డు బద్దలవుతుంది.

Story first published: Saturday, July 6, 2019, 14:26 [IST]
Other articles published on Jul 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X