న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బిస్కట్ ట్రోఫీని ఆవిష్కరించిన పాక్.. ఆస్ట్రేలియా కెప్టెన్లు

ICC triggers epic Twitter troll as PCB unveils Biscuit Trophy for Pakistan vs Australia T20I series

హైదరాబాద్: పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌ అబుదాబిలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లకంటే విజేతకు ఇచ్చే ట్రోఫీ గురించే అభిమానులు మధ్య చర్చ ఎక్కువైంది. ఎందుకంటే అన్ని ట్రోఫీల కంటే ఇది భిన్నంగా ఉండటమే కారణం.

ట్రోఫీలో బిస్కెట్‌ మాదిరి రూపాన్ని

సాధారణంగా ట్రోఫీలను బంతి, బ్యాట్‌, వికెట్ల ఆకారంలో రూపొందిస్తుంటారు. అయితే పాక్‌-ఆసీస్‌ టీ20 ట్రోఫీలో బిస్కెట్‌ మాదిరి రూపాన్ని చేర్చారు. ఓ బంతి, మూడు వికెట్లు.. దానిపై భాగంలో బిస్కెట్‌ రూపంతో ఉన్న ఈ ట్రోఫీపై ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. టీ20 సిరీస్‌ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు ఆరోన్‌ ఫించ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఈ ట్రోఫీని అబుదాబిలో ఆదివారం ఆవిష్కరించారు.

ఇవ్వడం, తీసుకోవడంలో కొత్త అర్థం

ఈ ట్రోఫీ బిస్కెట్‌ రూపంలో ఉండటంతో ఐసీసీ కూడా స్పందించింది. ‘బిస్కెట్‌ను ఇవ్వడం, తీసుకోవడంలో కొత్త అర్థం ఉంటుంది' అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. అనంతరం ఇరుజట్ల కెప్టెన్లు బిస్కెట్‌ ట్రోఫీ పట్టుకున్న ఫొటోను, గతంలో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ, పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ పట్టుకున్న పాత ఫొటోను జత చేసి ఈ ట్రోఫీ గురించి బాధపడకండి అంటూ మరో ట్వీట్‌ చేసింది ఐసీసీ.

ట్రోఫీ గురించి సామాజికమాధ్యమాల్లో విమర్శలు

అయితే క్రికెట్‌ అభిమానులు మాత్రం ఈ ట్రోఫీ గురించి సామాజికమాధ్యమాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇది ఫొటోషాప్‌ చేసింది కాదు. నిజంగా ట్రోఫీ ఇలాగే ఉంది.' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకరు దీనిని ఎవరు ఆమోదించారని పెడితే.. మరొకరు అబ్బా ఏం ట్రోఫీ.. బిస్కట్ ట్రోఫీ అంటూ ఎగతాళి చేస్తున్నారు.

రోటీ కప్ ఇవ్వాల్సిందేనంటూ మరి కొందరు

ఈ ట్వీట్లకు భిన్నంగా పాకిస్తాన్ ప్రదర్శనకు తగ్గట్టుగా ట్రోఫీ ఇవ్వాలంటే రోటీ కప్ ఇవ్వాల్సిందేనంటూ మరి కొందరు నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. టీ20 సిరీస్‌కు ముందు పాక్‌-ఆస్ట్రేలియాల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరిగింది. ఈ సిరీస్‌ను పాక్‌ 1-0తేడాతో గెలుచుకుంది.

Story first published: Wednesday, October 24, 2018, 13:37 [IST]
Other articles published on Oct 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X