న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టెస్టు ర్యాంకులు: కోహ్లీనే టాప్, 73వ ర్యాంక్‌తో కెరీర్‌ని ప్రారంభించిన షా

ICC Test rankings: Virat Kohli retains top spot, Ravindra Jadeja closes in on top all-rounder position

హైదరాబాద్: టెస్టు ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని మరింతగా పదిలం చేసుకున్నాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తాజాగా శుక్రవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

<strong>డీఆర్ఎస్ కాల్: మైదానంలో ఎగిరి గంతేసిన కెప్టెన్ కోహ్లీ (వీడియో)</strong>డీఆర్ఎస్ కాల్: మైదానంలో ఎగిరి గంతేసిన కెప్టెన్ కోహ్లీ (వీడియో)

కెరీర్‌లో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు 937తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గత శనివారం రాజ్‌కోట్ వేదికగా వెస్టిండిస్‌తో ముగిసిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ(139 పరుగులు) సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. కోహ్లీతో పాటు తొలి టెస్టులో యువ ఓపెనర్ పృథ్వీ షా కూడా సెంచరీని నమోదు చేశాడు.

దీంతో కోహ్లీ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా, పృథ్వీ షా 73వ ర్యాంక్‌తో తన కెరీర్‌ని ప్రారంభించాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టులో అరంగేట్రం చేసిన ఆరోన్ ఫించ్‌ 72వ ర్యాంకులో ఉన్నాడు. పాక్‌పై 85, 141 పరుగులు చేసిన కంగారూ ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖావాజా తొలిసారి టాప్‌-10లో స్థానం దక్కించుకున్నాడు.

<strong>హైదరాబాద్ టెస్ట్: సెల్ఫీ కోసం వచ్చి కోహ్లీకి ముద్దివ్వబోయిన అభిమాని</strong>హైదరాబాద్ టెస్ట్: సెల్ఫీ కోసం వచ్చి కోహ్లీకి ముద్దివ్వబోయిన అభిమాని

ఉస్మాన్ ఖవాజా ప్రస్తుతం పదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంక్‌లో నిలిచాడు. రాజ్‌కోట్ టెస్టులో కుల్దీప్ ఆరు వికెట్లు పడగొట్టి తన ర్యాంకుని మరింతగా మెరుగుపరచుకున్నాడు.

అతనితో పాటు ఆ టెస్టులో నాలుగు వికెట్లు తీసి అజేయ సెంచరీ సాధించిన స్పిన్నర్‌ రవీంద్ర జడేజా బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో 6 స్థానాలు ముందుకెళ్లి 51వ ర్యాంకులో ఉన్నాడు. అదే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో, ఆల్‌రౌండర్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ఇక, జట్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా 115 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఈ జాబితాలో ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా (106), ఆస్ట్రేలియా (106), ఇంగ్లాండ్ (105), న్యూజిలాండ్ (102) ఉన్నాయి.

Story first published: Friday, October 12, 2018, 18:22 [IST]
Other articles published on Oct 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X