ఐసీసీ టెస్టు ర్యాంకులు: విరాట్ కోహ్లీ నంబర్ వన్ స్థానం పదిలం

ICC Test Rankings: Virat Kohli remains top-ranked batsman; Moeen Ali, Sam Curran take giant strides

హైదరాబాద్: ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన నంబర్ వన్ ర్యాంకుని నిలుపుకున్నాడు. సోమవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ 937 రేటింగ్ పాయింట్లతో తన నంబర్ వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆదివారంతో ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లీ 46, 58 పరుగులు చేసిన సంగత తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లో కలిపి విరాట్ కోహ్లీ 544 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన పుజారా తన ర్యాంకుని మెరుగుపరచుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా పుజారా తన ఖాతాలో మరో 32 పాయింట్లు చేరాయి. దీంతో మొత్తం 798 రేటింగ్ పాయింట్లతో పుజారా ఆరోస్థానంలో కొనసాగుతున్నాడు.

1
42377

ఇదిలా ఉంటే, నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లీషు గడ్డపై అత్యధిక పరుగులు (544) చేసిన భారత కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ (2006లో విండీస్‌పై 496) పేరిట ఉంది.

అంతేకాదు ఇంగ్లాండ్ నిర్దేశించిన 245 పరుగుల లక్ష్య ఛేదనలో హాఫ్‌ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి (58) వేగవంతంగా 4వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా నాల్గో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు నెలకొల్పాడు.

ఆ సిరీస్‌ ద్వారా ఇప్పటికే టెస్టుల్లో వేగవంతంగా ఆరువేల పరుగుల మైలురాయిని అందుకుని రెండో భారత క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి.. కెప్టెన్‌గా మరో మైలురాయిని కూడా అందుకున్నాడు. ఇప్పటివరకూ ఈ రికార్డు బ్రియాన్‌ లారా పేరిట ఉండగా దాన్ని కోహ్లి సవరించాడు.

లారా కెప్టెన్‌గా 40 టెస్టుల్లో 4 వేల పరుగులు చేయగా, కోహ్లి 39 టెస్టు మ్యాచ్‌ల్లోనే ఆ రికార్డు సాధించాడు. ఈ జాబితాలో కోహ్లి, లారా తర్వాత వరుసగా రికీ పాంటింగ్ (42 టెస్టుల్లో), గ్రెగ్‌ చాపెల్ (45), అలెన్ బోర్డర్ (49)లు టాప్-5లో ఉన్నారు. ఫలితంగా ఈ ఫీట్‌ను వేగవంతంగా సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు బద్దలు కొట్టాడు.

ఐసీసీ టెస్టు ర్యాంకులు - బ్యాట్స్‌మన్:
1 Virat Kohli - 937 points
2 Steve Smith - 929 points
3 Kane Williamson - 847 points
4 David Warner - 820 points
5 Joe Root - 809 points
6 Cheteshwar Pujara - 798 points
7 Dimuth Karunaratne - 754 points
8 Dinesh Chandimal - 733 points
9 Dean Elgar - 724 points
10 Aiden Markram - 703 points

ఇక, బౌలర్ల విషయానికి వస్తే ఇంగ్లాండ్‌కు చెందిన జేమ్స్ ఆండర్సన్ 896 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, భారత్‌కు చెందిన రవీంద్ర జడేజా 832 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-10 బౌలర్ల జాబితాలో భారత్‌కు చెందిన ఇద్దరు బౌలర్లు ఉండటం విశేషం.

ఐసీసీ టెస్టు ర్యాంకులు - బౌలర్లు:
1 James Anderson - 896 points
2 Kagiso Rabada - 882 points
3 Ravindra Jadeja - 832 points
4 Vernon Philander - 826 points
5 Pat Cummins - 800 points
6 Trent Boult - 795 points
7 Rangana Herath - 791 points
8 R Ashwin - 777 points
9 Neil Wagner - 765 points
10 Josh Hazlewood - 759 points

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Story first published: Monday, September 3, 2018, 15:42 [IST]
  Other articles published on Sep 3, 2018
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more