న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టీవ్ స్మిత్‌దే టాప్: 34 పాయింట్ల వెనుకంజలో విరాట్ కోహ్లీ

ICC Test Rankings: Steve Smith builds 34-point lead over Virat Kohli at the top

హైదరాబాద్: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్, ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఐసీసీ సోమవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో స్టీవ్ స్మిత్ 937 రేటింగ్ పాయింట్లతో తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నాడు. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో స్టీవ్ స్మిత్(80, 23) పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌కు ముందు స్టీవ్ స్మిత్ 857 రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సిరిస్‌లో స్మిత్ అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్‌ల్లో 110.57 యావరేజితో 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

యాషెస్ సిరీస్ నిలుపుకున్న ఆసీస్.. 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!!యాషెస్ సిరీస్ నిలుపుకున్న ఆసీస్.. 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి!!

ఫలితంగా టెస్టుల్లో తిరిగి నంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. ఇక, రెండో స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే స్మిత్ 34 పాయింట్ల ముందంజలో ఉన్నారు. ఇక, ఈ యాషెస్‌ సిరీస్‌లో పరుగుల వరద పారించిన స్టీవ్ స్మిత్‌ భారత దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ సరసన నిలిచాడు.

110 సగటుతో 774 పరుగులు

110 సగటుతో 774 పరుగులు

స్టీవ్ స్మిత్ యాషెస్‌ సిరీస్‌ 2019లో మొత్తంగా సుమారు 110 సగటుతో 774 పరుగులు చేసాడు. ఒక ఆటగాడు కనీసం నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడిన సిరీస్‌ పరంగా చూస్తే.. విండీస్‌ దిగ్గజ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ (829) తర్వాత స్థానాన్ని స్మిత్ ఆక్రమించాడు. ఇక గవాస్కర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు.

1971 తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో

1971 తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో

1971 తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లో గవాస్కర్‌ 774 పరుగులు చేసాడు. 2014-15 సీజన్‌లో బోర్డర్-గవాస్కర్‌ల పేరిట నిర్వహించిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో స్మిత్‌ 769 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రెండు, నాలుగు స్థానాల్లో స్మిత్‌ ఉండటం విశేషం. అంతేకాదు 21వ శతాబ్దంలో సింగిల్ టెస్టు సిరిస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

వార్నర్ చెత్త ప్రదర్శన

వార్నర్ చెత్త ప్రదర్శన

ఈ పర్యటనలో చెత్త ప్రదర్శన చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 19 స్థానాలు దిగజారిపోయి 24వ స్థానంలో నిలిచాడు. ఈ సిరిస్‌లో మొత్తం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 95 పరుగులే చేశాడు. ఈ సిరీస్‌లో ఆసీస్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌ను ఇంగ్లండ్ బౌలర్ బ్రాడ్ ఏడు సార్లు ఔట్ చేశాడు.

రెండు సార్లే డబుల్ డిజిట్

రెండు సార్లే డబుల్ డిజిట్

10 ఇన్నింగ్స్‌లో డేవిడ్ కేవలం రెండు సార్లే డబుల్ డిజిట్ సాధించాడు. యాషెస్ సిరీస్‌ను వార్నర్ కేవలం 9.5 సగటుతో ముగించాడు. వార్నర్‌ను ఏడు సార్లు ఔట్ చేసి బ్రాడ్ కొత్త టెస్ట్ రికార్డు సృష్టించాడు. ఒకే సిరీస్‌లో ఐదు సందర్భాల్లో మాత్రమే ఒక బౌలర్ ఏడు సార్లు ఔట్ చేసాడు. గత సిరీస్‌లో మొయిన్ అలీని నాథన్ లియాన్ ఔట్ చేసాడు.

29 వికెట్లు తీసిన కమ్మిన్స్

29 వికెట్లు తీసిన కమ్మిన్స్

ఇక, పేసర్ కమ్మిన్స్ విషయానికి వస్తే ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో మొత్తం 29 వికెట్లు పడగొట్టాడు. ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ టాప్-40లో చోటు దక్కించుకున్నాడు. మూడు వికెట్లు తీసిన శామ్ కుర్రన్ ఆరు స్థానాలు ఎగబాకి 65వ స్థానంలో నిలిచాడు.

Story first published: Monday, September 16, 2019, 15:22 [IST]
Other articles published on Sep 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X